ETV Bharat / state

ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం.. దిగువకు నీరు విడుదల

author img

By

Published : Aug 2, 2021, 10:15 AM IST

ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ కారణంగా 55 నుంచి 60 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Flood flow to Prakasam Barrage
ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం

ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ కారణంగా ఐదు గేట్లు ఎత్తివేసి.. 55 నుంచి 60 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటికే కృష్ణా తూర్పు, పడమర ప్రధాన కాల్వలకు 9 వేల క్యూసెక్కుల నీరు చేరింది. సాయంత్రానికి మరో 4 లక్షల క్యూసెక్కులు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఈ క్రమంలో కృష్ణా పరివాహక ముప్పు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. కలెక్టర్ నివాస్ తెలిపారు.

ఇదీ చదవండీ.. krishna water: ఇప్పటికైనా జల పంపకాలపై ఇద్దరు సీఎంలు చర్చించుకోవాలి..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.