ETV Bharat / city

krishna water: ఇప్పటికైనా జల పంపకాలపై ఇద్దరు సీఎంలు చర్చించుకోవాలి..!

author img

By

Published : Aug 2, 2021, 8:52 AM IST

కృష్ణా నది జల వివాదాన్ని అవకాశంగా తీసుకొని కేంద్రం రాజకీయంగా తెలుగు రాష్ట్రాలను తన అదుపులో పెట్టుకోవడానికి చూస్తోందని ప్రముఖ పర్యావరణ వేత్త మేధా పాట్కర్‌ అన్నారు. కేంద్రం అనుకుంటే రెండు రాష్ట్రాల సమస్యను పరిష్కరించగలదని...ఆమె తెలిపారు.

Environmentalist Medha Patkar‌  suggested to meet on water issue of telugu states chief ministers
పర్యావరణ వేత్త మేధా పాట్కర్‌

తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన కృష్ణా నది జలాల పంపకాలపై ఇద్దరు ముఖ్యమంత్రులు సామరస్య పూర్వకంగా చర్చించుకొని సమస్యను పరిష్కరించుకోవాలని ప్రముఖ పర్యావరణ వేత్త మేధా పాట్కర్‌ సూచించారు. ‘పాలమూరు అధ్యయన వేదిక - తెలంగాణ విద్యా వంతుల వేదిక’ ఆధ్వర్యంలో ‘కృష్ణా జలాల వివాదం - గెజిట్‌ పర్యవసానాలు’ అనే అంశంపై నిర్వహించిన వెబినార్‌లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

కృష్ణా నది జల వివాదాన్ని అవకాశంగా తీసుకొని కేంద్రం రాజకీయంగా తెలుగు రాష్ట్రాలను తన అదుపులో పెట్టుకోవడానికి చూస్తోందని ఆరోపించారు. కేంద్రం అనుకుంటే రెండు రాష్ట్రాల సీఎంలను చర్చలకు పిలిచి మధ్యవర్తిగా ఉండి ఏకాభిప్రాయం సాధించి సమస్యను పరిష్కరించి ఉండవచ్చన్నారు. ఆచార్య హరగోపాల్‌, ఆచార్య కోదండరామ్‌, మాడభూషి శ్రీధర్‌ తదితరులు మాట్లాడారు.

ఇదీ చూడండి.

Nagarjuna Sagar Dam: 22క్రస్టు గేట్లను 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటి విడుదల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.