ETV Bharat / state

మరో సారి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు-జలాశయాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 9, 2023, 10:44 AM IST

Updated : Dec 9, 2023, 11:34 AM IST

Gundlakamma Project Gate Washed Away in Maddipadu: అంతా అనుకున్నట్లే అయ్యింది. ఏదైతే జరగకూడదని భయపడ్డారో అదే జరిగింది. ప్రభుత్వ నిర్లక్ష్యానికి సాగునీటి ప్రాజెక్టు నిర్వీర్యం అవుతోంది. కనీసం నిర్వహణ లేక ఆ ప్రాజెక్టు గేట్లు ఒక్కొక్కటి విరిగి కొట్టుకుపోతున్నాయి. గత అనుభవాలను, నష్టాలను కనీసం పట్టించుకోని ప్రభుత్వ విధానంలో మరో సారి నష్టాన్ని చవిచూడాల్సి వస్తుంది. ప్రకాశం జిల్లాలో మద్దిపాడు మండలంలో ఉన్న గుండ్లకమ్మ రిజర్వాయర్‌ స్పిల్‌వే రెగ్యులేటర్​కు సంబంధించిన మరో గేట్‌ కొట్టుకుపోయింది. నిండుగా ఉన్న నీరంతా సముద్రం పాలవుతుంది.

Gundlakamma_Project_Gate_Washed_Away_in_Maddipadu
Gundlakamma_Project_Gate_Washed_Away_in_Maddipadu

మరో సారి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు-జలాశయాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

Gundlakamma Project Gate Washed Away in Maddipadu : ప్రభుత్వ నిర్లక్ష్యానికి కందుల ఓబిల్‌ రెడ్డి గుండ్లకమ్మ జలాశయం మరో సారి వార్తల్లోకెక్కింది. గత ఏడాదిలో జరిగిన నష్టానికైనా కళ్లు తెరవని ప్రభుత్వం మరో నష్టాన్ని చవిచూసింది.. రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. మద్దిపాడు మండలం మల్లవరం వద్ద నిర్మించిన గుండ్లకమ్మ రిజర్వాయర్‌లో స్పిల్‌ వే రెగ్యులేటర్‌లో ఉన్న రెండోవ గేట్‌ శుక్రవారం రాత్రి 8గంటల ప్రాంతంలో కొట్టుకుపోయింది. గత ఏడాది ఆగస్టు 31 రాత్రి మూడో గేట్‌ ఇదే విధంగా కొట్టుకుపోయింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులు సందర్శించి నెల రోజుల్లో కొత్త గేట్‌ ఏర్పాటు చేసి, రిజర్వాయర్‌ నిర్వహణకోసం నిధులు మంజూరుచేస్తామని, 15 గేట్లూ బాగు చేస్తామని ప్రగల్భాలు పలికారు. కానీ అవన్నీ నీటి మాటలయ్యాయి. 3వ గేట్‌ను మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది.

Kandula Obula Reddy Gundlakamma Reservoir Project Situation : మిగ్‌జాం తుపానుకు (Michaung Cyclone) ముందు జలాశయంలో 1.3టీఎంసీలే ఉన్నాయి. తుపాను కారణంగా ఎగువ ప్రాంతం నుంచి ఇన్‌ఫ్లో ఎక్కువగా రావడంతో జలాశయంలోకి 2.5టీఎంసీల నీరు చేరింది. బుధవారం రాత్రి రెండు గేట్లు ఎత్తి కొంత మేర నీరు దిగువకు వదిలారు. ఉద్ధృతి తగ్గిందనుకొని తిరిగి మూసివేశారు. అప్పటికే తుప్ప పట్టిపోయి ఉన్న 5, 6 గేట్లు మాత్రం మార్చి కొత్తివి ఏర్పాటు చేశారు. మిగిలిన గేట్లు ఎప్పుడు కొట్టుకుపోతాయోనని సర్వత్రా భయాందోళనతో ఉన్నారు. అంతా భయపడినట్లే పైనుంచి ప్రవాహం ఎక్కువ కావడంతో మరమ్మతులకు నోచక తుప్పుపట్టి ఉన్న రెండో గేటులోని అడుగు భాగం కొంత శుక్రవారం రాత్రి కొట్టుకుపోయింది. నీళ్లన్నీ సముద్రంలోకి పోతున్నాయి.

ఏపీ గుండ్లకమ్మ ప్రాజెక్టులో విరిగిన రెండో గేట్

Gundlakamma Reservoir in Trouble : గేటు కొట్టుకుపోయిందని తెలిసి స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో అధికారులు విద్యుతు సరఫరా నిలిపివేశారు. వరద నీరు దిగువకు పెద్ద ఎత్తున వస్తుండటంతో పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆయా గ్రామాల్లో దండోరా వేయించారు. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

Gundlakamma Project Present Situation : రెండో గేట్‌ నీటిని నియంత్రించేందుకు స్టాప్‌ లాక్‌ ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించినా అది విఫలమయ్యింది. ఒక వైపు చీకటి, మరో వైపు నైపుణ్యమైన పనివారు లేకపోవడం వల్ల కొద్దిగా కిందకు దించినా, దిగకపోవడంతో వాయిదా వేసారు. మూడో గేట్‌ విరిగిన వెంటనే యుద్దప్రాతిపదికన గేట్లు బాగుచేసి ఉంటే, ఈ పరిస్థితి వచ్చేది కాదని పలువురు అంటున్నారు. ప్రభుత్వం ప్రాజెక్టును పట్టించుకోకపోవడం వల్లే గేట్లు కొట్టుకుపోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టులో 'స్టాప్‌లాక్' ఏర్పాటుకు ఆటంకం.. నీటిని ఖాళీ చేయిస్తున్న అధికారులు

TDP Leaders on Gundlakamma Project : గుండ్లకమ్మ ప్రాజెక్టు రెండో గేటు కొట్టుకుపోయి నీరు వృథాగా పోతుండటంపై అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా గుండ్లకమ్మ మూడో కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. వైసీపీ ప్రభుత్వంలో ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టు గేటు, అన్నమయ్య ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయని మండిపడ్డారు. సాగునీటి ప్రాజెక్టుల మరమ్మతులకు నిధులు కేటాయించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే గుండ్లకమ్మ ప్రాజెక్టుకు ఈ దుస్థితి ఏర్పడిందని కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయస్వామి విమర్శించారు.

మరో సారి కొట్టుకుపోయిన గుండ్లకమ్మ ప్రాజెక్టు గేటు-జలాశయాన్ని గాలికొదిలేసిన వైసీపీ ప్రభుత్వం

గుండ్లకమ్మ జలాశయంలో దెబ్బతిన్న మూడో గేటు.. వృథాగా పోతున్న నీరు

Last Updated : Dec 9, 2023, 11:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.