సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ ఏం చెప్పారు ? ఏం చేస్తున్నారు ?
Prathidwani: ఒక వైపు భారీస్థాయిలో సాగునీరు సముద్రం పాలవుతోంది. మరోవైపు కరవుకాటకాలతో రాష్ట్రం అల్లాడిపోతోంది. అన్నింటా రివర్స్ గేర్‌లో సాగుతోన్న జగనన్న పాలనలో.. పడకేసిన సాగునీటి ప్రాజెక్టుల దుస్థితి కూడా ప్రస్తుతం సంక్షోభంలో ప్రధాన కారణంగా కనిపిస్తోంది. గత పాలకులు ఏం చేశారు... జగన్ ఏం చేయడం లేదో పోలవరం, పట్టిసీమ, అర్థాంతరంగా ఆగిన మరెన్నో ప్రాజెకుల పురోగతే కళ్లకు కడుతోంది. గోదావరి - పెన్నా వంటి నదుల అనుసంధానంతో ఎంత మేలు జరిగేదో అందరికీ అవగతంలోకి వస్తోంది. ఎండుతున్న సాగర్ ఆయకట్టు, మండుతున్న రాయసీమ రైతుల గుండెలు జరిగిన నష్టానికి సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. తమ హయాంలో 68 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, 32లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ, 7లక్షల ఎకరాలకు కొత్తగా నీరిందించామని తెలుగుదేశం చెబుతోంది. ఇలా అంకెల్లో చూస్తే వైసీపీ హయాం సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎక్కడున్నారు. అసలు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జగన్ ఏం చెప్పారు.. ఏం చేస్తున్నారు. ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.