ETV Bharat / state

గొలుసు చోరీ విఫలం.. ఆపై దొంగకు దేహశుద్ది..

author img

By

Published : Jan 20, 2023, 1:35 PM IST

Chain Robbery: ఒంటరిగా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లేందుకు ఇద్దరు దుండగులు యత్నించారు. ఈ ఘటనతో అప్రమత్తమైన మహిళ వారిపై తిరగబడింది. ఈ ఘటన నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో జరిగింది.

గొలుసు చోరీ
గొలుసు చోరీ

గొలుసు చోరీ విఫలం.. ఆపై దొంగకు దేహశుద్ది..

Chain Robbery: నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్క్ సమీపంలో.. గొలుసు చోరీకి దొంగల యత్నించారు. నిన్న రాత్రి ఓ మహిళ తన కుమారుడిని బస్​ స్టాండ్​కు పంపించేందుకు.. ఆటోలో వెళ్లింది. అక్కడి నుంచి ఇంటికి రోడ్డుపై తిరిగొస్తుండగా.. దారిలో ఇద్దరు దొంగలు ఆమె మెడలో గొలుసు లాక్కెళ్లేందుకు యత్నించారు. వెంటనే స్పందించిన ఆ మహిళ గొలుసు గట్టిగా పట్టుకుని కేకలు వేసింది. అనంతరం చుట్టు పక్కల ఉన్న వారు ఘటనా స్థలానికి చేరుకుని ఒక దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు. అనంతరం బాలాజీనగర్‌ పోలీసులకు అప్పగించారు. మరో దొంగ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మరో దొంగ కోసం గాలిస్తున్నారు. నిందితులు నెల్లూరు సరస్వతినగర్‌కు చెందిన క్యాబ్‌ డ్రైవర్లు చందు, సురేష్‌గా పోలీసులు గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.