Atmakur bypoll: ఆత్మకూరు ఉపఎన్నిక.. దొంగ ఓట్ల కలకలం

Atmakur bypoll: ఆత్మకూరు ఉపఎన్నిక.. దొంగ ఓట్ల కలకలం
atmakur bypoll: ఆత్మకూరు ఉపఎన్నికల్లో దొంగ ఓట్ల కలకలం రేపాయి. డీసీపల్లిలో దొంగఓట్లు వేస్తున్న మహిళలను భాజపా అభ్యర్థి గుర్తించారు. భాజపా నేతల రాకతో మహిళలు సచివాలయంలోకి పరుగులు తీశారు. భాజపా వాళ్లు సచివాలయంలోకి వెళ్లగా... వైకాపా నాయకులు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది.
Atmakur bypoll : నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికల్లో మర్రిపాడు మండలం డీసీపల్లిలో దొంగ ఓట్లు కలకలం రేపాయి. భాజపా అభ్యర్థి పోలింగ్ కేంద్రం పరిశీలనకు వచ్చిన సమయంలో.. దొంగ ఓట్లు వేస్తున్న మహిళలను గుర్తించారు. భాజపా అభ్యర్థిని చూసిన మహిళలు వెంటనే సచివాలయంలోకి పరిగెత్తారు. వారిని అనుసరించి సచివాలయంలోకి వెళ్లగా.. వైకాపా నేతలు అతనితో వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు జోక్యం చేసి.. ఇరువర్గాల వారికి నచ్చజెప్పారు. దొంగ ఓట్ల వ్యవహారంపై అధికారులకు భాజపా అభ్యర్థి ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి: బాలయ్య 'అన్స్టాపబుల్'లో మెగాస్టార్.. షారుక్ సినిమాలో రానా!
పోస్టల్ సిబ్బంది నిర్లక్ష్యం... ముళ్లతుప్పల్లో ఆధార్ కార్డులు.. ఇంకా అన్నీ
సూపర్ సోలార్ కార్.. పైసా ఖర్చు లేకుండా జర్నీ.. మ్యాథ్స్ టీచర్ ఐడియా అదుర్స్!
