ETV Bharat / state

చంద్రబాబు, మీడియా సంస్థలను నిందిస్తే సచ్చీలుడు కాలేవు :సోమిరెడ్డి

author img

By

Published : Dec 19, 2022, 12:38 PM IST

Updated : Dec 19, 2022, 12:49 PM IST

SOMIREDDY ON MINISTER KAKANI : నీచమైన నేర చరిత్రతో మంత్రి కాకాణి గోవర్దన్‌రెడ్డి.. నెల్లూరు జిల్లా పరువు తీశారని.. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. కోర్టులో పత్రాల దొంగతనం కేసులో.. చంద్రబాబునో, మీడియా సంస్థలనో నిందిస్తే సచ్చీలుడు కాలేరంటూ.. హితవు పలికారు. ఏమాత్రం నైతికత ఉన్నా మంత్రి పదవి నుంచి కాకాణి తప్పుకోవాలని డిమాండ్‌ చేశారు.

SOMIREEDY FIRES ON MINISTER KAKANI
SOMIREEDY FIRES ON MINISTER KAKANI

SOMIREEDY FIRES ON MINISTER KAKANI : న్యాయస్థానంలో దస్త్రాలు చోరీపై తానే సీబీఐ విచారణ కోరానని కాకాణి కట్టుకథలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఈ కేసును కోర్టు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది.. కాబట్టే సీబీఐ విచారణ జరుగుతోందని స్పష్టం చేశారు. సీబీఐ విచారణ అధికారాలు ఎవరికి ఉన్నాయో కూడా మంత్రికి అవగాహన లేదని విమర్శించారు. ఓ ముద్దాయి కోరితే సీబీఐ విచారణ జరగదనే విషయం తెలుసుకోవాలని హితవు పలికారు.

చంద్రబాబు, మీడియా సంస్థలనో నిందిస్తే సచ్చీలుడు కాలేవు

జీవితమంతా నేర చరిత్ర ఉన్న కాకాణి.. మీడియా సంస్థలపైనా, చంద్రబాబు పైనా విమర్శలు చేస్తే సచ్చీలుడు కాలేడని ధ్వజమెత్తారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టాక చంద్రబాబుని, మీడియా సంస్థల్ని నిందించడం తప్ప రైతులకు ఏం చేశాడో కాకాణి చెప్పుకోగలడా అని ప్రశ్నించారు. రాష్ట్రపతి పాలన సమయంలోనే కాకాణిపై కల్తీ మద్యం కేసు ఉందని గుర్తు చేశారు. ఎంతో మంది చావుకు కారణమైన ఈ కేసులో కాకాణి తోటి ముద్దాయిలు అంతర్జాతీయ స్మగ్లర్లు అని ఆరోపించారు.

అప్పు అనే స్మగ్లర్ కాకాణి కేసులో అరెస్టై జైల్లోనే చనిపోయాడని తెలిపారు. నకిలీ పత్రాల కేసులో సహచరులంతా జైలుకు పోతే కాకాణి మాత్రం బెయిల్ తెచ్చుకున్నాడని ఆక్షేపించారు. ఆశకు అంతం లేదన్నట్లు విశ్రాంతి అధికారుల స్థలాన్ని కాజేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రావెల్​కు కక్కుర్తి పడి పారిశ్రామిక భూముల్ని అక్రమంగా తవ్వేశారని దుయ్యబట్టారు. కాకాణి చేసిన ఇన్ని నేరాలకు మీడియా కు, చంద్రబాబుకు ఏం సంబంధం అని నిలదీశారు. ఏమాత్రం నైతిక విలువలు ఉన్నా తక్షణమే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated : Dec 19, 2022, 12:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.