ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదులో అవకతవకలు.. తెదేపా ఫిర్యాదు

author img

By

Published : Nov 11, 2022, 4:43 PM IST

Irregularities in voter registration for graduate MLC election: రాష్ట్రంలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలకు.. ఓటరు నమోదు చేసుకునే ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయని తెదేపా నాయకులు ఆరోపించారు. అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలని సీఈఓను కోరామని,.. వారి నుంచి స్పందన లేకుంటే.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు.

MLC Ashok Babu
ఎమ్మెల్సీ అశోక్ బాబు

Irregularities in voter registration for graduate MLC election: పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఓటరు నమోదులో అవకతవకలు జరిగాయంటూ ప్రధాన ఎన్నికల అధికారికి తెదేపా ఫిర్యాదు చేసింది. ఈ నెల 7వ తేదీన నెల్లూరు, చిత్తూరుల్లో ఒకే రోజు 54వేల దరఖాస్తులు రావటంతో.. అనేక అనుమానాలకు తావిస్తోందని తెదేపా నేతలు స్పష్టం చేశారు. వైకాపా నేతలు తహసీల్దార్​లను బెదిరించి.. గంపగుత్తుగా దరఖాస్తులు ఇచ్చారని ఆరోపించారు. తెదేపా నేతలు ఒకే కుటుంబానికి చెందిన నాలుగు దరఖాస్తులు ఇచ్చినా.. అధికారులు పట్టించుకోలేదని తెదేపా నేతలు మండిపడ్డారు.

చివరి రోజు వచ్చిన 54వేల దరఖాస్తులపై.. సమగ్ర విచారణ జరిపించాలని సీఈఓను కోరామని,.. స్పందన లేకుంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయిస్తామని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఒక నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోనే చివరిరోజు 10వేల దరఖాస్తులు ఇచ్చారని.. తూర్పు రాయలసీమ తెదేపా ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ తెలిపారు. అదనపు కౌంటర్లు లేకుండా ఇది అసాధ్యమని ఆయన తెలిపారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి తెప్పించిన దొంగ సర్టిఫికెట్​లతో.. ఓటరు నమోదు జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాలంటీర్ల ప్రమేయం ఉండకూడదని ఎన్నికల సంఘం ఇచ్చిన నిబంధనలు క్షేత్రస్థాయిలో అమలు కావట్లేదన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.