ETV Bharat / state

పేరుకే నెక్లెస్ రోడ్డు - మందుబాబులకు అడ్డాగా మారిన వైనం 'వైసీపీ రాకతో అధ్వానం'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 1, 2023, 3:08 PM IST

Development of NTR Necklace Road Stopped in Jagan Government:నెల్లూరు ప్రజల కోసం చక్కటి ఉద్యనవనాన్ని రూపొందించాలనే ఉద్దేశంతో టీడీపీ ప్రభుత్వం..ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరుతో ప్రారంభించారు.ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చుచేసి అభివృద్ధికి కృషి చేశారు. పనులు పూర్తికాకుండానే జగన్ సర్కారు అధికారంలోకి రావడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయి.సకాలంలో పనులు పూర్తై ఉంటే జిల్లాలో పెద్ద పర్యాటక ప్రాంతంగా నిలిచే ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ప్రస్తుతం చెత్తాచెదారంతో నిండిపోయింది.

Development_of_NTR_Necklace_Road_Stopped_in_Jagan_Government
Development_of_NTR_Necklace_Road_Stopped_in_Jagan_Government

Development of NTR Necklace Road Stopped in Jagan Government: నెల్లూరు ప్రజల ఆహ్లాదం కోసం తెలుగుదేశం పాలనలో అద్భుతంగా నిర్మించిన ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఉద్యానవనం.. నేడు అధ్వానంగా మారింది. వ్యర్థాలతో దుర్గంధం వెదజల్లుతోంది. వైసీపీ నాలుగున్నర ఏళ్ల పాలనలో.. కనీసం ఈ సమస్యను పట్టించుకున్నపాపాన పోలేదు.


Neglegence of YCP Government Park Roads Completely Damaged :జగన్ ప్రభుత్వం పూర్తిచేసి ఉంటే జిల్లాలో పెద్ద పర్యాటక ప్రాంతంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు తెలుగుదేశం హయాంలో పురపాలక శాఖ మంత్రిగా నారాయణ ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా ప్రజల కోసం చక్కటి ఉద్యనవనాన్ని..ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు పేరుతో అభివృద్ధి చేశారు. అప్పటిలో ఇందుకోసం కోట్ల రూపాయలు ఖర్చుచేశారు. రెండు కిలోమీటర్లు పొడవునా సిమెంట్ రోడ్డు నిర్మాణం చేశారు. స్వర్ణాల చెరువు, పక్కనే ఇరుకళల పరమేశ్వరీ ఆలయం, సమీపంలోనే జొన్నవాడ , నరసింహ కొండ ఆలయాలకు పర్యాటకులు వెళ్లేలా సుందరీకరించారు. ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డును పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేశారు. ఆకట్టుకొనే స్వాగత ద్వారం, ట్యాంక్ బండ్ మీద జాతీయ నాయకుల విగ్రహాలు, స్నానాలకు గణేష్ ఘాట్​ను అభివృద్ధి చేశారు. చూడచక్కనైన ఈ ప్రాంతాన్ని వైసీపీ ప్రభుత్వం చూడలేకపోయినట్లుంది. ఎందుకంటే వైసీపీ పాలన మొదలైనప్పటి నుంచి అభివృద్ధి పనులను నిలిపివేశారు. దీంతో ఈ ప్రాంతం చెత్తాచెదారంతో నిండిపోవడంతో..పర్యాటకులు ఎవరూ రావడంలేదు.

"మున్సిపాలిటి సిబ్బంది రావడం మానేశారు. ఎవరైనా అధికారులు వచ్చినప్పుడే వస్తారు. టీడీపీ ప్రభుత్వం హయాంలో రోడ్డు పరిస్థితి బాగా ఉండేది". - స్థానికులు

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన కేంద్రం - వినియోగించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం

Nellore Necklace Road Development Stopped Under YCP Govt: వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యానవనం రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. విగ్రహాలు పడిపోయే పరిస్థితికి చేరాయి. పచ్చదనం కనుమరుగైంది. ఎటుచూసినా పిచ్చిమొక్కలు పెరిగిపోయాయి. అనైతిక కార్యక్రమాలకు నెక్లెస్‌ రోడ్డు నిలయంగా మారింది. గతంలో జనం ఉదయాన్నే ఈ రోడ్డుపై వాకింగ్‌ చేసేవారు. అధ్వానంగా మారిన రోడ్డును ప్రస్తుతం ఎవరూ కన్నెత్తి కూడా చూడటం లేదు. టీడీపీ ప్రభుత్వం సమయంలో మిగిలిన కొద్ది పనులను.. జగన్ ప్రభుత్వం పూర్తిచేసి ఉంటే జిల్లాలో పెద్ద పర్యాటక ప్రాంతంగా ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు ఉండేదని స్థానికులు అంటున్నారు.

వైరల్​గా మారిన రాష్ట్రంలోని రహదారులు - రోడ్లపై గుంతలు! కోపం,వ్యంగ్యంతో స్పందిస్తున్నా - పట్టించుకోని సర్కారు


"జగన్ సర్కారు అభివృద్ధి పనులను నిలిపివేయడంతో రోడ్లు పూర్తిగా పాడయిపోయాయి.4 సంవత్సరాలలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయింది. దొంగలు, మందుబాబులకు అడ్డాగ ఈ రోడ్డు తయారయింది". - స్థానికులు

వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత రూ.17.5 కోట్లతో ఎన్టీఆర్ నెక్లెస్ రోడ్డు, స్వర్ణాల చెరువు బండ్‌ను అభివృద్ధి చేసేందుకు టెండర్లు పిలిచారు. నిధులు మంజూరు చేయాలని, పనులు చేయాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి గతంలో నుడా కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. కార్యాలయాన్ని ముట్టడిస్తామని... హెచ్చరించారు. జీవో నెంబర్ 45ప్రకారం క్లియరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయినా నేటికి ప్రభుత్వం పట్టించుకోలేదు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.