వైరల్‌గా మారిన రాష్ట్రంలోని రహదారులు - రోడ్లపై గుంతలు! కోపం,వ్యంగ్యంతో స్పందిస్తున్నా - పట్టించుకోని సర్కారు
Updated: Nov 18, 2023, 10:50 PM |
Published: Nov 18, 2023, 10:50 PM
Published: Nov 18, 2023, 10:50 PM
Follow Us 

TDP janasena Joint Agitation on Roads Situation in AP: రాష్ట్రంలోని రహదారులు దారుణంగా మారిపోయాయి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అవి ఎలా ఉన్నాయని పట్టించుకున్న పాపానపోలేదు. అధ్వన్నంగా మారిన రోడ్ల ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.

1/ 12
TDP janasena Joint Agitation on Roads Situation in AP: రాష్ట్రంలో రోడ్ల దుస్థితిపై ప్రతిపక్షాలు నెత్తి నోరు కొట్టుకున్నా వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలోని అన్ని రహదారుల పరిస్థితి అలాగే ఉందని.. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరాలు గడిచిన పట్టించుకోవడం లేదని ప్రతిపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోని జనసేన టీడీపీ సంయుక్తంగా గుంతల ఆంధ్రప్రదేశ్‌కు దారేది సీఎం పేరుతో వినూత్న కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల టీడీపీ, జనసేన నేతలు నిరసనలకు దిగారు. రోడ్లపై భేఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అభివృద్ధిని పక్కన పెట్టిన ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలేెస్లో నిద్రపోతున్నారని టీడీపీ - జనసేన నేతలు దుయ్యబట్టారు. వైసీపీ ప్రభుత్వం నిజాలను దాచిపెట్టి.. అబద్దాలను ప్రచారం చేస్తోందని వారు మండిపడ్డారు. వైసీపీ నాయకులు చేపట్టిన బస్సుయాత్రను రోడ్లు అధ్వాన్నంగా ఉన్న ప్రదేశాల్లో నిర్వహిస్తే.. ప్రజల కష్టాలు తెలుస్తాయంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Loading...
Loading...
Loading...