ETV Bharat / state

అభివృద్ధి పనులకు నిధులు కేటాయించిన కేంద్రం - వినియోగించలేని స్థితిలో జగన్ ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 20, 2023, 4:01 PM IST

Vijayawada_Development_Works
Vijayawada_Development_Works

Vijayawada Development Works: అభివృద్ధి పనులకు నిధులు కేటాయించలేని వైసీసీ ప్రభుత్వం.. కేంద్రం ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా వినియోగించలేని పరిస్థితిలో ఉంది. మార్చి నాటికి అభివృద్ధి పనులు పూర్తిచేయకపోతే.. కేంద్రం కేటాయించిన నిధులు తిరిగి వెనక్కి వెళ్లిపోనున్నాయి.

Vijayawada Development Works: విజయవాడ అభివృద్ధికి నిధులు కేటాయించలేని జగన్ సర్కార్.. కేంద్రం ఇచ్చిన నిధులను ఖర్చు చేయలేని పరిస్థితిలో ఉంది. నగర అభివృద్ధి పనులకు కేంద్రం కేటాయించిన నిధులను.. మార్చి నాటికి ఖర్చు చేయాల్సిఉంది. వీఎంసీ అధికారులు హడావుడిగా చేపట్టిన నగర అభివృద్ధి పనులు పూర్తవుతాయో.. లేదో తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది.

Development Works Delay in Vijayawada: విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పనులకు 150 కోట్ల రూపాయలు ఇస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం(AP Govt).. గత మూడేళ్లలో కనీసం నాలుగో వంతు నిధులు విడుదల చేయకుండా మొండిచేయి చూపించింది. కనీసం కేంద్ర ప్రభుత్వం(Central Govt) నుంచి వచ్చే నిధులనైనా సక్రమంగా వినియోగించి ప్రజల సమస్యలు తీర్చిందా.. అంటే అదీ లేదు. కేంద్ర 15వ ఆర్థిక సంఘం ఇచ్చే నిధులతో నగరంలో ప్రస్తుతం చేపడుతున్న పనుల తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Village Development Works: మీ పనులు మాకొద్దు బాబోయ్..! ప్రభుత్వ పనులంటే ఆసక్తి చూపని సర్పంచ్‌లు..

People Facing Problems with No Development Works in AP: నగరంలోని రహదారులు, తాగునీటి పైప్‌లైన్ల కోసం నగరపాలక సంస్థకు.. కేంద్ర ఆర్థిక సంఘం నిధులు 249.43 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. నగరానికి 24 గంటల తాగునీటి సరఫరా అందించేందుకు 101 కోట్లు రూపాయలు కేటాయించగా.. మిగతా నిధులు రహదారుల విస్తరణ(Roads Expansion), అభివృద్ధి కోసం కేటాయించారు. మొత్తం నిధుల్లో ఇప్పటివరకూ 152 కోట్ల రూపాయలు మాత్రమే ఖర్చు చేశారు.

Central Govt Funds for Vijayawada Development Works: వీటిలో మంచినీటి పైప్‌లైన్‌ పనులకు 48 కోట్ల రూపాయలు.. రహదారులకు రూ.104 కోట్ల వరకు వెచ్చించారు. వచ్చే ఏడాది మార్చి నాటికి పనులు పూర్తిచేయకపోతే.. మిగిలిన నిధులు వెనక్కివెళ్లిపోతాయి. దీంతో వీలైనంత త్వరగా ఆ నిధులు ఖర్చు చేయాలని అధికారులు పూనుకున్నారు. నగరంలో మంచినీటి పైపులైన్లు సహా అన్నింటినీ ముందుగా పూర్తిచేశాకే.. రహదారులను వేయాలి. కానీ.. నగరపాలక సంస్థలో ఒక ప్రణాళిక లేకుండా ఒకవైపు నుంచి రహదారులను వేయడం, మరోవైపు నుంచి వాటిని పైప్‌లైన్ల కోసం తవ్వేయడం చేస్తోంది.

Development Works Delay in AP: మార్చి నెల నాటికి పూర్తయ్యే లక్ష్యంతో ప్రస్తుతం అభివృద్ధి పనులు చేస్తున్నారు. కొన్నిచోట్ల పనులు ఇంకా ఆరంభం కాలేదు. అభివృద్ధి పనులు ఎప్పటికి పూర్తిచేస్తారో తెలియక నగరవాసుల్లో అసహనం నెలకొంది. విజయవాడ నగర అభివృద్ధి కేంద్రం కేటాయించిన నిధులనైనా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించి.. అభివృద్ధి పనులు(Development Works) పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.

అయోమయంలో రాష్ట్ర పరిస్థితి.. కనిపించని అభివృద్ధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.