ETV Bharat / state

Lokesh fire CM Jagan: "అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిన 'జగనోరా' వైరస్.. చంద్రబాబే వ్యాక్సిన్"

author img

By

Published : Jul 5, 2023, 7:32 PM IST

Nara Lokesh Yuvagalam Padayatra: కరోనా కంటే జగనోరా వైరస్ ప్రమాదకరమని నారా లోకేశ్ విమర్శించారు. జగనోరా వైరస్ అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిందన్న ఆయన.. వ్యాపారస్తులు కూడా జగనోరా వైరస్ బాధితులేనని, జగనోరా వైరస్​కి వ్యాక్సిన్ చంద్రబాబేనని చెప్పారు. యువగళం పాదయాత్ర 147వ రోజు కోవూరు నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా లోకేశ్.. సాలుచింతల విడిది కేంద్రం వద్ద వ్యాపారులతో ముఖాముఖి నిర్వహించారు.

Etv Bharat
Etv Bharat

Yuvagalam Padayatra 147 Day: యువగళం పాదయాత్ర 147వ రోజు కోవూరు నియోజకవర్గంలో కొనసాగింది. ఈ సందర్భంగా లోకేశ్.. సాలుచింతల విడిది కేంద్రం వద్ద వ్యాపారులతో ముఖాముఖి నిర్వహించారు. స్టౌవ్‌బీడీ కాలనీ, పడుగుపాడు, కోవూరు బజారు, మండబైలు, గుమ్మలదిబ్బ, పాతూరు, దామరమడుగు, ఆర్‌ఆర్‌.నగర్‌, కాగులపాడు, రేబాల కూడలి మీదుగా పాదయాత్ర కొనసాగుతోంది.

చంద్రబాబే వ్యాక్సిన్... కరోనా కంటే జగనోరా వైరస్ ప్రమాదకరమని తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేశ్ విమర్శించారు. జగనోరా వైరస్ అన్ని వ్యవస్థల్ని నాశనం చేసిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో వ్యాపారస్తులతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వ్యాపారస్తులు తమ సమస్యలను లోకేశ్ కు విన్నవించారు. వ్యాపారస్తులు కూడా జగనోరా వైరస్ బాధితులేనని లోకేశ్ అన్నారు. జగనోరా వైరస్ కి వ్యాక్సిన్ చంద్రబాబేనని చెప్పారు. జగన్ పాలనలో క్రాప్ హాలిడే, ఆక్వా హాలిడే చూశామని, త్వరలో వ్యాపారస్తులు బిజినెస్ హాలిడే ప్రకటించే ప్రమాదం కూడా ఉందన్నారు. జగన్ సొంత పార్టీ నాయకుడు సుబ్బారావు గుప్తా బండిలో గంజాయి పెట్టి వేధించారని ఆరోపించారు. పన్నులు, విద్యుత్ ఛార్జీలు, పెంచి వ్యాపారస్తులను, రైస్ మిల్లర్లను జగన్ ఇబ్బంది పెడుతున్నారని తెలిపారు.

విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పెంచేసిన పన్నులు, విద్యుత్ చార్జీలను తాము తగ్గిస్తామని హామీ ఇచ్చారు. కాస్ట్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి వ్యాపారాలు చేసుకునేందుకు అయ్యే ఖర్చులు, పెట్రోల్, డీజిల్ పై పన్నులు తగ్గిస్తామని ప్రకటించారు. బియ్యం ఎగుమతులు కోసం కేంద్రం వసూలు చేస్తున్న పన్నులను, చిరు వ్యాపారస్తులు జీఎస్టీ రిటర్న్స్ చెల్లింపుల్లో నిబంధనలను సడలించేలా టీడీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తారని అన్నారు. నిమ్మలో ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాలకు కావాల్సిన రకాలు ఇక్కడ పెంచే విధంగా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. కోల్డ్ స్టోరేజ్ లు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి రైతులకు, వ్యాపారస్తులకు సాయం అందిస్తామని, టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రొఫెషనల్ ట్యాక్స్ రద్దు చేస్తామని ప్రకటించారు. ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి గతంలో తాము ఇచ్చిన సబ్సిడీలను పునరుద్ధరిస్తామని లోకేశ్ తెలిపారు.

రైతుల సంక్షేమానికి కట్టబడి ఉన్నాం.. కోవూరు పాదయాత్రలో రైతులు నారా లోకేశ్​ను కలిసి వినతిపత్రం అందజేశారు. సాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, సమస్య పరిష్కారానికి లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. పెన్నానది నుంచి గొలుసుకట్టు చెరువులకు నీరు సరిగా అందక తాగు, సాగు నీటికి ఇబ్బందిగా ఉందని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వానికి ఎన్ని అర్జీలు పెట్టినా లాభం లేకుండా పోయిందని, టీడీపీ అధికారంలోకి రాగానే సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని అన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి ప్రాజెక్టులు, వనరులపై రూ.68,294 కోట్లు ఖర్చుచేస్తే, జగన్ వచ్చాక అందులో నాలుగోవంతు కూడా ఖర్చుచేయలేదని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటుచేసి కోవూరు ప్రజల సాగు, తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని లోకేశ్ హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైతాంగ సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.