Lokesh on CM Jagan: జగన్ తయారు చేసేది ఊరికో సత్య నాదెళ్లను కాదు.. ఊరికో అనంతబాబును: లోకేశ్
Nara Lokesh Yuvagalam Padayatra: సీఎం జగన్ తయారు చేసేది ఊరికో సత్యనాదెళ్లను కాదని.. ఊరికో అనంతబాబును తయారు చేస్తున్నాడని.. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. 143వ రోజు యువగళం పాదయాత్రను.. నెల్లూరు జిల్లా గోపాలపురం నుంచి కొనసాగించారు. దారిపొడవునా ప్రజల్ని పలకరిస్తూ.. ముందుకు సాగిన లోకేశ్.. ముత్తుకూరు బహిరంగ సభలో పాల్గొన్నారు. నెల్లూరు జిల్లాకు ముగ్గురు మంత్రులుగా పనిచేసి సాధించిందేంటని నిలదీశారు. మంత్రి కాకాణి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్‌పై.. వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సైకో జగన్‌కు బిల్డప్ తప్ప ఏమీ లేదని.. రాష్ట్రాన్ని గంజాయి వ్యాపారంతో నింపాడని విమర్శించారు. పన్నులతో ప్రజలపై బాదుడే బాదుడంటూ ధ్వజమెత్తారు. దేశ చరిత్రలో 100 పథకాలను రద్దు చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్‌కే ఉంటుందని అన్నారు. జాబ్ క్యాలెండర్ లేదు.. మెగా డీఎస్సీ లేదు.. వచ్చేది టీడీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడితే పగులగొట్టండని అన్నారు. ఎమ్మెల్యే అనిల్‌కు సీటు లేదని చెప్పడంతో ఫ్రస్టేషన్‌తో ఏదేదో మాట్లాడుతున్నాడని లోకేశ్ విమర్శించారు.