ETV Bharat / state

క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయండి.. మా కళాశాలలో చేరండి..! అధ్యాపకుల వినూత్న ప్రచారం

author img

By

Published : Apr 8, 2023, 7:36 PM IST

QR code on leaflet govt College campaign
పార్వతీపురం ప్రభుత్వ కళాశాల వినూత్న ప్రచారం

QR code on leaflet govt College campaign: పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి అధ్యాపకులు కృషి చేస్తున్నారు. అడ్మిషన్లు పెంచడానికి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ.. విద్యార్థులను కలిసి తమ కళాశాలలో చేరాలని కోరుతున్నారు. కళాశాల చరిత్ర, గొప్పదనం, వసతులు తదితర వివరాలు తెలిసేలా కరపత్రాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

QR code on leaflet govt College campaign: పార్వతీపురం మన్యం జిల్లాలోని ప్రభుత్వ కళాశాల అభివృద్ధికి అధ్యాపకులు కృషి చేస్తున్నారు. అడ్మిషన్లు పెంచడానికి సాంకేతికతను సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇంటింటి ప్రచారం చేస్తూ.. విద్యార్థులను కలిసి తమ కళాశాలలో చేరాలని కోరుతున్నారు. కళాశాల చరిత్ర, గొప్పదనం, వసతులు తదితర వివరాలు తెలిసేలా కరపత్రాలపై ముద్రించిన క్యూఆర్ కోడ్ విశేషంగా ఆకట్టుకుంటోంది.

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను 1969 సంవత్సరంలో స్థాపించారు. 54 వసంతాలు పూర్తి చేసుకుని ఉత్తరాంధ్రలో ప్రవేశాల్లో కూడా పెద్ద కళాశాలగా తన స్థానాన్ని ఏటా పదిల పరుచుకుంటోందీ కళాశాల. అక్కడ అధ్యాపకులు విద్యా బోధనతో పాటు కళాశాల ప్రవేశాలు పెంచేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ క్రమంలో 2023- 24 విద్యా సంవత్సరానికి గాను అత్యధిక ప్రవేశాలు పొందేందుకు ప్రచారం ముమ్మరం చేశారు.

కరపత్రాలను ముద్రించి ప్రస్తుతం పరీక్షలు జరుగుతున్న పదో తరగతి కేంద్రాలకు వెళ్లి విద్యార్థులకు వాటిని అందజేస్తూ.. తమ కళాశాల పట్ల వారికి అవగాహన కల్పిస్తున్నారు. సాంకేతికతతో కళాశాల ప్రిన్సిపల్ రాజు ఆలోచన చేసి కరపత్రంపై క్యూఆర్​ కోడ్ నమోదు చేశారు. దాని ద్వారా కళాశాలలో సౌకర్యాలు అమలు చేస్తున్న గ్రూపులు తదితర అంశాలను పొందుపరిచారు.

కరపత్రంపై కళాశాలలో ఉన్న వసతులు, ల్యాబ్లు ఇతర సౌకర్యాలను ముద్రించడం సాధ్యం కాని పని. అందుకే కళాశాల చరిత్ర అంతటినీ విద్యార్థుల కళ్లముందు ఆవిష్కరించేందుకు క్యూఆర్ కోడ్ ముద్రించినట్లు ఆయన తెలిపారు. కోడ్ సహాయంతో విద్యార్థి కళాశాలకు సంబంధించిన అన్ని విషయాలను తెలుసుకునే వీలు ఉంటుందని అధ్యాపకులు భావిస్తున్నారు.

కళాశాలలో ఎంపీసీ, బైపీసీ, సిఈసీ హెచ్​ఈసీతో పాటు ఏడు వృత్తి విద్యా కోర్సులు అమలు చేస్తున్నారు. పార్వతీపురం చుట్టుపక్కల గిరిజన ప్రాంతాల ఉండడంతో ఈ కోర్సులకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఏటా ఆన్ జాబ్ ట్రైనింగ్ శిక్షణ అమలు చేస్తూ విద్యార్థులను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి సంవత్సరం 500కు పైగా ప్రవేశాలు పొందుతూ ఉత్తరాంధ్రలో ప్రత్యేక గుర్తింపు సాధిస్తున్నారు.

ఈ క్రమంలోనే వచ్చే విద్యా సంవత్సరంలో తమ కళాశాలలో 700 మంది విద్యార్థుల ప్రవేశం పొందడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని ప్రిన్సిపాల్ రాజు తెలిపారు. అందుకోసం విద్యార్థి చెంతకు వెళ్లి కళాశాల చరిత్ర, సౌకర్యాలు, అమలు చేస్తున్న కోర్సులు ప్రభుత్వ పరంగా అమలవుతున్న పథకాలు విద్యార్థులకు వివరిస్తున్నామన్నారు. అధ్యాపకుల సహకారంతో కళాశాల అభివృద్ధికి చేస్తున్న కృషి మంచి ఫలితాలను ఇస్తుందని, అనుకున్న విద్యార్థులు కళాశాలలో చేరుతున్నారని ఆయన అన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.