ETV Bharat / state

AP Crime News: తమ్ముడు చేతిలో అన్న దారుణ హత్య.. గంజాయి కేసులో ఎస్ఐకి జ్యుడీషియల్ కస్టడీ

author img

By

Published : May 24, 2023, 7:34 AM IST

Etv Bharat
Etv Bharat

AP Crime News: పార్వతీపురం జిల్లాలో పెళ్లి ఖర్చుల విషయంలో అన్నదమ్ముల మధ్య మొదలైన ఘర్షణ వారిలో ఒకరి ప్రాణం తీసింది. మరో ఘటనలో గంజాయిని పట్టుకోవాల్సిన ఎస్​ఐ గంజాయి మాఫియాతో చేతులు కలిపి అక్రమాలకు పాల్పడ్డాడు. అతనికి న్యాయమూర్తి 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. వైఎస్సార్ జిల్లాలో వినోద్​ వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తి వేట కొడవలితో దాడి చేశాడు.

వినోద్ పై వేట కొడవలితో గుర్తు తెలియని వ్యక్తి దాడి

AP Crime News : పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం ఏజెన్సీ ప్రాంతంలో కుటుంబ సభ్యుల కలహాలతో సొంత తమ్ముడు చేతిలో అన్న హత్యకు గురయ్యాడు. ఈ విషాద సంఘటన కురుపాం మండలం జి.శివడ పంచాయతీ వేపమానుగూడ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు అందించిన వివరాలు ప్రకారం... వేపమానుగూడ గిరిజన గ్రామానికి చెందిన పాలక ఇండియా (30) అనే యువకుడు తన ఇంటి ఆవరణలో దారుణంగా హత్యకు గురయ్యాడు. మృతుడి తమ్ముడు పాలక మిన్నారావు ఈ హత్యకు పాల్పడినట్లు గ్రామస్థులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నెల 20న తమ్ముడు పాలక మిన్నారావు వివాహం జరిగింది. ఆ పెళ్లి ఖర్చుల నిమిత్తం ఇరువురు అన్నదమ్ములు సోమవారం రాత్రి గొడవ పడ్డారు. ఈ గొడవలో సొంత అన్నయ్య పాలక ఇండియాపై తమ్ముడు మిన్నారావు కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఇండియా మృతి చెందాడు. వెంటనే నిందితుడు పరారైయ్యాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నట్లు ఎల్విన్ పేట సీఐ సత్యనారాయణ, నీలకంఠాపురం ఇంఛార్జి ఎస్​ఐ షణ్ముఖరావు పేర్కొన్నారు.

గంజాయి కేసులో ఎస్​ఐ..14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ : అల్లూరి సీతారామరాజు జిల్లా మోతుగూడెం ఎస్ఐ సత్తిబాబు నెల్లూరు గంజాయి కేసులో ప్రమేయం ఉండడంతో అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. న్యాయమూర్తి 14 రోజులు జ్యుడీషియల్​ కస్టడీకి అప్పగించినట్లు ఎస్పీ తుహీన్ సిన్హా ఓ ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్ 21న ఎస్సీబీ అధికారులు నెల్లూరులో గంజాయి ముఠాను పట్టుకున్నారు. ఇందులో అల్లూరి జిల్లా మోతుగూడెం పోలీసులు గంజాయి మాఫియాలో చేతులు కలిపినట్లు కేసు నమోదు చేశారు. ఈ కేసులో అదే స్టేషన్​ కు చెందిన ఇద్దరు కానిస్టేబుళ్లను అరెస్టు చేయగా ఎస్​ఐ సత్తిబాబు పరారయ్యారు. నెల తర్వాత సీఐ ముందు లొంగిపోగా అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. రోజుల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించినట్లు ఎస్పీ చెప్పారు. కేసు ప్రస్తుతం విచారణలో ఉందని పేర్కొన్నారు.

వేట కొడవలితో దాడి : వైఎస్సార్ జిల్లా పులివెందులలోని నగరిగుట్టలో మోట వినోద్ పై గుర్తు తెలియని వ్యక్తి వేట కొడవలితో దాడి చేశాడు. వినోద్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకువెళ్లారు. ఆర్థిక పరమైన వివాదాలే దాడికి కారణమై ఉంటుందని బంధువులు ఆరోపిస్తున్నారు. దాడి అనంతరం కొందరు ఆగంతకులు వినోద్‌ రెండు బైకులకు నిప్పు అంటించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని అల్లరి మూకల్ని చెదరగొట్టారు. దాడికి గల కారణాలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

మృతదేహంతో కలెక్టరేట్ ఎదుట నిరసన : విద్యుత్తు శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఓ లైన్ మెన్ మృతి చెందాడని ఆరోపిస్తూ బంధువులు, తోటి ఉద్యోగులు చిత్తూరు కలెక్టరేట్ ఎదుట మృత దేహంతో నిరసన తెలియజేశారు. యాదమరి మండలం వరదరాజులపల్లి సచివాలయం గ్రేడ్ 2 లైన్ మెన్ పవన్ కుమార్ విద్యుత్తు స్తంభం ఎక్కి మరమ్మతులు చేస్తున్న సందర్భంలో విద్యుత్తు షాక్ కు గురై చికిత్స పొందుతూ మరణించాడు. అయితే విద్యుత్తు పనులకు సంబంధించి మేయింటేనేన్స్ పనులు సక్రమంగా జరగడం లేదని..ఈ నేపథ్యంలోనే అనేక ప్రమాదాలు చోటుచేసుకున్నట్లు లైన్ మెన్లు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పోలీసులు సర్ధి చెప్పడంతో మృతదేహాన్ని అక్కడి తరలించారు.

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.