ETV Bharat / state

YCP Leaders Attacked TDP Leaders: మరోమారు రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ శ్రేణుల ఇళ్లుకు వెళ్లి రాడ్లు, కర్రలతో దాడి

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 30, 2023, 11:49 AM IST

Updated : Aug 30, 2023, 1:36 PM IST

YCP Leaders Attacked TDP Leaders: అధికార పార్టీ నేతల దాడులకు రాష్ట్రంలో అంతమనేది లేకుండా పోతోంది. తాజాగా పల్నాడు జిల్లాలో మరోసారి అలజడి చెలరేగింది. వైసీపీ నేతల అరాచకంతో మళ్లీ రక్తం చిందింది. తెలుగుదేశం పార్టీ శ్రేణులపై వైసీపీ గుండాలు దాడికి పాల్పడడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

ycp_leaders_attacked_tdp_leaders
ycp_leaders_attacked_tdp_leaders

YCP Leaders Attacked TDP Leaders: మరోమారు రెచ్చిపోయిన వైసీపీ నేతలు.. టీడీపీ శ్రేణుల ఇళ్లుకు వెళ్లి రాడ్లు, కర్రలతో దాడి

YCP Leaders Attacked TDP Leaders: రాష్ట్రంలో అధికార పార్టీ నేతలు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. తాము ఏం చేసినా చెల్లుతుంది అనే రీతిలో దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా వీరు మరోసారి రెచ్చిపోయారు. వైసీపీ వర్గీయులు, టీడీపీ మద్దతుదారుల పరస్పర దాడులతో పల్నాడు జిల్లాలో మళ్లీ రక్తం చిందింది. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్లలో సత్తెమ్మ తల్లి కొలుపుల్లో ఇరువర్గాల మధ్య చోటు చేసుకున్న వివాదం తీవ్ర ఘర్షణకు దారి తీసింది. సుమారు గంట సేపు గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వైసీపీ నేతకు తీవ్ర గాయం కావడంతో టీడీపీ మద్దతుదారుల ఇళ్లపై అధికార పార్టీ వారు విచక్షణా రహితంగా దాడులు చేశారు.

YSRCP anarchists: అరాచకాల అడ్డా.. నేరాల గడ్డ.. వైఎస్సార్​సీపీ అధికారంలోకి వచ్చాక ఇన్ని దారుణాలా..!

Disagreements between ruling and opposition parties: పల్నాడులో మరోమారు అధికార, ప్రతిపక్ష పార్టీ వర్గీయుల మధ్య విబేధాలు భగ్గుమన్నాయి. వెల్దుర్తి మండలం గొట్టిపాళ్ల గ్రామంలో సత్తెమ్మ కొలుపులు జరుగుతుండగా ఇరు వర్గాల మధ్య వివాదం చోటు చేసుకుంది. టీడీపీ మద్దతుదారులు అమ్మవారికి మొక్కులు చెల్లించేందుకు ఊరేగింపుగా వెళ్లుతూ చల్లిన కుంకుమ.. వైసీపీ వర్గీయులపై పడింది. దీంతో గొడవ మొదలై ఇరు వర్గాలు ఘర్షణకు దిగడంతో వైసీపీ నేత రవీంద్రకు గాయాలయ్యాయి. దీంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు కర్రలు, మారణాయుధాలతో టీడీపీ మద్దతుదారుల నివాసాలపై దాడులు చేశారు. ప్రాణభయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇరు వర్గాలు కర్రలు, మరణాయుధాలతో పరస్పరం దాడులు చేసుకోవడంతో టీడీపీ, వైసీపీ వర్గీయులు గాయపడ్డారు. దీంతో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు... రాళ్లు, కర్రలు, కత్తులు, సీసాలతో టీడీపీ మద్దతుదారుల ఇళ్లపై దాడి చేయడంతో గృహాలు ధ్వంసమయ్యాయి. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన మహిళలు ఇంట్లో నుంచి ప్రాణభయంతో పరుగులు తీశారు. అక్కడ గంటకు పైగా ఈ దాడులు కొనసాగాయి.

YSRCP Attacks: నన్ను ఎమైనా అంటే నా అభిమానులకు బీపీ పెరుగుతుంది.. 'వైసీపీ దాడులపై' జగన్​తీరు

Tension conditions in Gottipallo village: మారుమూల అటవీ ప్రాంతం కావడం, మండల కేంద్రానికి సుమారు 40 కిలోమీటర్ల దూరం ఉండటం వల్ల ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. గ్రామంలో ఉద్రిక్తత పరిస్థితులు, దాడుల గురించి పోలీసులకు సమాచారం ఇచ్చినా.. ఎవరూ గ్రామానికి రాలేదని ఘర్షణలో గాయపడిన వారు ఆరోపిస్తున్నారు. పోలీసులు వెంటనే వచ్చి ఉంటే దాడుల తీవ్రత ఈ స్థాయిలో ఉండేది కాదని వాపోయారు. దాడుల్లో గాయపడిన వైసీపీ , టీడీపీ వర్గీయులకు తొలుత మాచర్ల ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన సేవల కోసం క్షతగ్రాతుల్ని నర్సరావుపేట ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

YCP leaders Attacks: వినుకొండకు పాకిన దాడుల సంస్కృతి.. రెచ్చగొట్టి మరీ వైసీపీ దాడులు

Prathipati Pullarao condemned the YCP attack: గొట్టిపాళ్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ దాడిని మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు ఖండించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, అధికారమదంతో వైసీపీ దమనకాండకు పాల్పడుతోందని విమర్శించారు. టీడీపీ కార్యకర్తల ఇళ్లపై వైసీపీ శ్రేణుల దాడిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గంటసేపు గ్రామంలో అధికార పార్టీ కార్యకర్తలు ఇళ్ళ మీద పడి వీరంగం సృష్టించిన పోలీసులు స్పందించకపోవడం దారుణమని వినుకొండ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు మండిపడ్డారు. ఇదే పరిస్థితి కొనసాగితే ఆత్మ రక్షణ కోసం టీడీపీ కార్యకర్తలు ప్రతిదాడులు చేయక తప్పదని హెచ్చరించారు.

Last Updated : Aug 30, 2023, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.