ETV Bharat / state

వైకాపా నేత అరాచకం : పంటకు నిప్పు.. రైతుకు రూ.3.5 లక్షల నష్టం!

author img

By

Published : May 26, 2022, 12:16 PM IST

రాష్ట్రంలో అధికార పార్టీ అరాచకాలు రోజురోజుకూ పెచ్చుమీరుతున్నాయి. నేతల అండదండలతో వైకాపా వర్గీయులు రెచ్చిపోతున్నారు. అమాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. తాజాగా రొంపిచర్ల మండలంలో చిక్కుడు పంటకు వైకాపా నేత నిప్పుపెట్టారు. ఆ నేతపై బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 3.5 లక్షలు ఆస్తినష్టం కలిగిందని రైతు కన్నీరు మున్నీరయ్యారు.

YCP leader sets fire to crop
పంటకు నిప్పంటించిన వైకాపా నేత

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం తుంగపాడులో ఓ రైతు చిక్కుడు తోటకు వైకాపా నేత నిప్పంటించడంతో కాలిబూడిదైపోయింది. పోలీసుల కథనం ప్రకారం.. తుంగపాడుకు చెందిన ఈదర సీతారామయ్య ఎకరం విస్తీర్ణంలో చిక్కుడు తోట సాగుచేశారు. అదే గ్రామానికి చెందిన వైకాపా నేత ఏనుగంటి వెంకటరావు మంగళవారం దానికి నిప్పుపెట్టారు. దీంతో.. తోట, బిందుసేద్యం పరికరాలు, పందిర్ల కోసం అమర్చిన గుంజలు అన్నీ కాలిపోయాయి. దీంతో.. బాధిత రైతు పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసినట్లు రొంపిచర్ల ఎస్​ఐ తెలిపారు. ఈ ఘటనలో రూ.3.5 లక్షలు నష్టపోయినట్లు బాధిత రైతు తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో.. అధికార పార్టీ అండతోనే వెంకటరావు నిప్పు అంటించారని బాధిత రైతు ఆరోపించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.