ETV Bharat / state

పల్నాడులో ఉద్రిక్తత.. వెల్దుర్తి పోలీస్​స్టేషన్​ను చుట్టుముట్టిన టీడీపీ కార్యకర్తలు

author img

By

Published : Dec 14, 2022, 3:52 PM IST

TENSION IN PALNADU : పల్నాడు జిల్లా వెల్దుర్తి పోలీస్​స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ఇద్దరు తెదేపా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారంటూ.. ఆ పార్టీ నేత జూలకంటి బ్రహ్మారెడ్డి ఆరోపించారు. అరెస్టు చేసిన కార్యకర్తలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

TDP LEADERS PEOTEST
TDP LEADERS PEOTEST

TDP LEADERS PROTEST IN PALNADU : పల్నాడు జిల్లా వెల్దుర్తిలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. తెలుగుదేశం జెండా పట్టుకుని తిరిగారంటూ ఇద్దరు ఎస్సీ యువకులను పోలీసులు తీసుకెళ్లారంటూ ఆ పార్టీ నేత జూలకంటి బ్రహ్మరెడ్డి.. శ్రేణులతో కలిసి పోలీస్​స్టేషన్ ముట్టడించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ క్రమంలో స్టేషన్​లోకి వెళ్లేందుకు బ్రహ్మారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. పోలీసులు, కార్యకర్తల మధ్య జరిగిన తోపులాటలో ఓ మహిళ సొమ్మసిల్లి పడిపోయింది.

వెల్దుర్తిలో జరుగుతున్న ఓ శుభకార్యానికి బ్రహ్మారెడ్డి హాజరుకాగా.. ఆయనకు మద్దతుగా తెలుగుదేశం కార్యకర్తలు బైక్‌లకు జెండాలు కట్టుకుని ర్యాలీ చేశారు. దీంతో ఇద్దరు ఎస్సీ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఏ తప్పు చేయకపోయినా.. తమ కార్యకర్తలను అరెస్ట్ చేయడంపై బ్రహ్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.