నరసరావుపేట బైపాస్‌ రోడ్డుపై ప్రయాణించాలంటే 'కత్తి మీద సాములాంటిదే' బాబు!

author img

By ETV Bharat Andhra Pradesh Desk

Published : Nov 9, 2023, 8:54 AM IST

Updated : Nov 9, 2023, 12:20 PM IST

Dangerous_Narasaraopet_Bypass_Road

Dangerous Narasaraopet Bypass Road: పల్నాడు జిల్లా నరసరావుపేట బైపాస్‌ రోడ్డుపై ప్రయాణించాలంటే వాహనదారులకు లైసెన్స్‌ ఉంటే చాలదు. వాహనాన్ని అష్ట వంకరలు తిప్పే ప్రావీణ్యం కలిగి ఉండాలి. అప్పుడే ఈరోడ్డులో ప్రయాణించడం సాధ్యమవుతుంది. గుంతలు తప్ప రోడ్డు కనిపించని ఈ మార్గంలో ప్రయాణిస్తే వాహనాలు షెడ్డుకు, మనుషులు ఆస్పత్రిలో చేరటం ఖాయమంటున్నారు.

నరసరావుపేట బైపాస్‌ రోడ్డుపై ప్రయాణించాలంటే 'కత్తి మీద సాములాంటిదే' బాబు!

Dangerous Narasaraopet Bypass Road : నగరాలు, పట్టణాల్లోని ట్రాఫిక్​లో, ఇరుకు సందుల్లో ప్రయాణించే కంటే బైపాస్ మార్గంలో వేగంగా వెళ్లేందుకు వాహనాదారులు ఆసక్తి చూపిస్తుంటారు. సరుకు రవాణా లారీలు, భారీ వాహనాలూ నగరంలోకి రాకుండా బై పాస్ రోడ్డులోనే వెళ్లుతుంటాయి. కానీ పల్నాడు జిల్లా నరసరావుపేట బైపాస్ మార్గంలో ప్రయాణించాలంటే మాత్రం వాహనాదారులు బెంబేలెత్తిపోతున్నారు. గుంతలు తప్ప రోడ్డు లేని ఈ దారిలోకి వస్తే బండ్లు మరమ్మతులకు, మనుషులు ఆసుపత్రులకు వెళ్లడం ఖాయమంటున్నారు.

Road Situation in YSRCP Government : రహదారిపై ద్విచక్రవాహనాలు, ఆటోలు, కార్లు, లారీలు నడపాలంటే డ్రైవింగ్ లైసెన్స్ (Driving License) ఉంటే సరిపోతుంది. జిల్లాలోని రహదారులపై ప్రయాణం సాగించాలంటే మాత్రం బండి నడిపే నైపుణ్యమే కాదు భారీ గుంతల్ని తప్పిస్తూ వాహనాన్ని అష్ట వంకరలు తిప్పే ప్రావీణ్యం కలిగి ఉండాలి. అప్పుడే నరసరావుపేట బైపాస్ మార్గంలో ప్రయాణించగలరు. లేని పక్షంలో ఈ వాహనాదారుడు ప్రమాదాల బారిన పడి చేతులు, కాళ్లు విరగొట్టుకుని ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందని ప్రయాణికులు ఛలోక్తులు విసురుతున్నారు.

Damage roads in Guntur : రోడ్లను అభివృద్ధి చేయాలని నాట్లు వేసి మహిళల నిరసన

AP Roads At Dangerous Situation : నరసరావుపేట శివారు ఇస్సపాలెం నుంచి జొన్నలగడ్డ మీదుగా గుంటూరు రహదారి (Guntur Road)లో కలిసే బైపాస్ మార్గమిది. ఎలాంటి నిర్వహణ లేక, కనీస మరమ్మతులకు నోచుకోక గుంతలతో నరకానికి నకళ్లుగా మారిందని వాహనాదారులు వాపోతున్నారు. భారీ గోతులతో రహదారి పూర్తి అధ్వానంగా తయారైందని.. వాహనాల రాకపోకలకు ఏ మాత్రం అనువుగా లేక ప్రమాదాలకు నెలవుగా మారిందని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లారీలు, పెద్ద వాహనాలు ఈ మార్గంలో వస్తే మాత్రం షెడ్డుకు వెళ్లక తప్పదని డ్రైవర్లు గగ్గోలు పెడుతున్నారు.

Worst Roads in Palnadu District : పిడుగురాళ్ల, ముప్పాళ్ల మండలంలోని అనేక గ్రామాల ప్రజలు గుంటూరు వెళ్లేందుకు ఈ బైపాస్ మార్గంలోనే నిత్యం ప్రయాణం సాగిస్తుంటారు. సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నరసరావుపేట పట్టణాలకు సరకు రవాణా చేసే వాహనాలు, లారీలు ఈ దారిలోనే వెళ్లాల్సిన పరిస్థితి. నరసరాపేట పట్టణంలోకి వెళ్లి ట్రాఫిక్ చిక్కుకునే కంటే ఈ మార్గంలో వెళ్లితే.. త్వరగానే గమ్యం చేరుకోవచ్చు, సమయం కలిసి వస్తుందని ద్విచక్ర వాహనాదారులు ఈ మార్గంలో ఎక్కువగా వస్తుంటారు. అలా అనుకుని ఈ రహదారిలోకి రావడం ఎంత పెద్ద పొరపాటో తమ వాహనాలు దెబ్బతినప్పుడు, తమ ఒళ్లు హూనమైన తరువాత తెలుస్తోందని వాహనదారులు మండిపడుతున్నారు.

గుంటూరు రోడ్లు.. గుంతలమయం..!

రోడ్డుపై ప్రయాణించాలంటే కత్తి మీద సాములా మారింది : పట్టుమని పది మీటర్లు గుంతలు లేకుండా సాఫీగా కనిపించని ఈ ఇస్సపాలెం జొన్నలగడ్డ బైపాస్ రహదారి అంచులు దెబ్బతిని పెద్ద పెద్ద గోతులు ఉండడంతో ఎదురుగా వాహనాలు వస్తే తప్పుకునే వీలుండడం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో రహదారి దిగిన వారు గుంతల్లో పడి ప్రమాదాలు బారిన పడటం పరిపాటిగా మారింది. పూర్తిగా దెబ్బతిన్న ఈ మార్గంలో 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ప్రయాణం సాగించాలంటే కత్తి మీద సాములా మారిందని వాహనాదారులు భయపడిపోతున్నారు. గోతులు, గుంతలతో ఈ మార్గంలో తరుచు ప్రమాదాలు జరుగుతున్నా.. అధికారులు, పాలకులు కళ్లకు గంతలు వీడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్ టాక్స్ అని, ఆ టాక్స్ అని భారీగా పన్నులు వసూలు చేస్తున్న ప్రభుత్వం. కనీసం రహదారి మరమ్మతులు చేయకపోవడం దారుణమని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

అడుగుకో మడుగు.. ప్రయాణమంటే సాహసమే

Last Updated :Nov 9, 2023, 12:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.