ETV Bharat / state

కరవు నష్టం కొండంత - ప్రభుత్వ సాయం గోరంత! 'నలిగిపోతున్న రాష్ట్ర రైతులు'

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 6, 2023, 12:56 PM IST

YSRCP Government Negligence on Farmers: అధిక వానలు, అకాల వర్షాలు, తుపానులు, ఈదురుగాలులు, వడగళ్లు, అతివృష్టి లేదంటే అనావృష్టి ఆంధ్రావనిపై ప్రకోపిస్తూనే ఉంది. ఈ విపత్తులకు జగనన్న సర్కారు వికృత రాజకీయం తోడవటంతో నాలుగున్నరేళ్లుగా రాష్ట్రంలో అన్నదాతలు కష్టాల్లో తేలుతున్నారు. అయినా పేదలపక్షపాతినని చెప్పుకునే సీఎం జగన్‌కు మాత్రం చీమకుట్టినట్లైనా లేదు.

farmers_problems_in_andhra_pradesh
farmers_problems_in_andhra_pradesh

కరవు నష్టం కొండంత - ప్రభుత్వ సాయం గోరంత! 'నలిగిపోతున్న రాష్ట్ర రైతులు'

YSRCP Government Negligence on Farmers : విపత్తులతో 2019 నుంచి సుమారు 20వేల కోట్లకు పైగా విలువైన పంట ఉత్పత్తుల్ని రైతులు నష్టపోయి ఉంటారని అంచనా. అయితే సర్కారు పెట్టుబడి రాయితీగా ఇచ్చింది 19 వందల 77 కోట్లు మాత్రమే. అంటే మొత్తం నష్టంలో 10 శాతం మాత్రమే. నాలుగేళ్లుగా తుపాన్లు, వరదలతో అన్నదాతలు నిండా మునుగుతున్నా, వేల కోట్లలో నష్టపోతున్నా పెట్టుబడి రాయితీ పేరుతో పదీ పరకా ఇచ్చి సరిపెడుతున్నారు. అదే ఘనమైన సాయంగా సీఎం జగన్‌ ప్రచారం చేసుకుంటున్నారు.
Flooded villages in AP : 2019 అక్టోబరు చివరి వారంలో గుంటూరు నుంచి శ్రీకాకుళం వరకు కురిసిన వర్షాలతో వరి, పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయారు. రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబరులోనూ సాధారణం కంటే 39 శాతం అధికంగా వర్షాలు కురిశాయి. భారీగా వరి నేలకొరిగింది. సుమారు 6 లక్షల ఎకరాల్లో పత్తి దెబ్బతిన్నట్లు అంచనా. సుమారు వెయ్యి కోట్లకు పైనే నష్టం జరిగింది. ఈ వర్షాలు కౌలు రైతులను కోలుకోలేని దెబ్బ తీశాయి. 2020 ఖరీఫ్‌లో వరి రైతులు జులై, సెప్టెంబరు, అక్టోబరులో మూడుసార్లు మునిగారు. వ్యవసాయ, ఉద్యాన పంటలతో పాటు పశు, మత్స్య రంగాలకు 15 వందల కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. 2020 నవంబరులో నివర్ తుపాను ప్రభావంతో 17 లక్షల 33 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ప్రాథమిక అంచనాలను అప్పటి వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు అసెంబ్లీలో ప్రకటించారు. మొత్తంగా 3 వేల 187 కోట్ల మేర పంట నష్టం జరిగింది.

వరి రైతు వెన్నువిరిచిన 'మిగ్​జాం' - నిండా మునిగి దిక్కుతోచని స్థితిలో అన్నదాత
Michaung cyclone in andhra : 2021 జులైలో కురిసిన వర్షాలతో పత్తి, వరి నారుమళ్లు, నాట్లు నీట మునిగాయి. సెప్టెంబరులో గులాబ్ తుపాను ముంచేసింది. అక్టోబరు, నవంబరులోనూ భారీ వర్షాలు కురిసి 13 లక్షల 24 వేల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టంతోపాటు పశు, మత్స్యరంగాలను కలిపితే 18 వందల 92 కోట్ల నష్టం జరిగిందని అంచనా. 2022 జులైలో గోదావరికి వరదలతో పరిసర జిల్లాలు అతలాకుతలమయ్యాయి. ఎగువన కురిసిన భారీ వర్షాలతో 25 లక్షల 80 వేల క్యూసెక్కుల వరద ముంచెత్తి నారుమళ్లు మునిగిపోయాయి. 2022 డిసెంబరులో మాండౌస్ తుపాను 16 జిల్లాల్లో బీభత్సం సృష్టించింది. సుమారు 4 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని రైతులు చెబుతుంటే, అధికారులు మాత్రం లక్షా51 వేల ఎకరాల్లో నష్టం వాటిల్లిందని తేల్చారు.
Flooded villages in AP : 2023 మార్చిలో ఈదురుగాలులు, వడగళ్ల వానలతో 22 జిల్లాల్లో పంటలపై ప్రభావం పడిందని అంచనా, ఉద్యాన రైతులకు కోలుకోలేని నష్టం జరిగింది. అరటి, మామిడి, బొప్పాయితోపాటు అక్కడక్కడా వరికి తీవ్ర నష్టం వాటిల్లింది. సుమారు 3 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయని, పంట నష్టం వెయ్యి కోట్లకు పైనే ఉంటుందని రైతు సంఘాల నేతలు వెల్లడించారు. ప్రభుత్వం మాత్రం 50 వేల ఎకరాల్లోపే పంట నష్టంగా గుర్తించింది. ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల్లో కురిసిన ఆకాల వర్షాలతో 23 జిల్లాల పరిధిలో 6 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలోని పంటలు దెబ్బతింటే రాష్ట్ర ప్రభుత్వం 54 కోట్ల పెట్టుబడి రాయితీతో సరిపెట్టింది. మే నుంచి ఆగస్టు వరకు ఆకాల వర్షాలు, వరదలతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది. వారికి అందించిన సాయం రూ. 11 కోట్లు మాత్రమే.

రైతులకు కన్నీటిని మిగిల్చిన తుపాను - పంట మెులకలు వచ్చే అవకాశం

AP Latest News : 2021-22 ఆగస్టు, సెప్టెంబరులో రాయలసీమలో వర్షాభావం నెలకొంది. వేరుశనగ ఎకరాకు 106 కిలోల దిగుబడి మాత్రమే వచ్చింది. పంటనష్టాన్ని కేంద్ర బృందం దృష్టికి తీసుకెళ్లినా, కరవుగా గుర్తించలేదు. 2022-23లోనూ కర్నూలు, పల్నాడు, రాయలసీమ ప్రాంతంలో వర్షాభావ పరిస్థితులు తలెత్తాయి. 273 మండలాల్లో పొడివాతావరణం నెలకొంది. 18 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. అయినా ఒక్క మండలాన్నీ కరవు ప్రభావితంగా ప్రకటించలేదు. ఈ ఏడాది ఖరీఫ్‌లో తీవ్ర వర్షాభావం నెలకొంది. సుమారు 30లక్షల ఎకరాల సాగు తగ్గింది. 400లకు పైగా మండలాల్లో దుర్భిక్ష పరిస్థితులుంటే, కేవలం 103 మండలాలను మాత్రమే కరవు ప్రభావితంగా ప్రకటించారు. రైతులకు వేల కోట్లలో నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి జగన్ మాత్రం కొద్దిపాటి కరవే అంటూ కొట్టిపారేశారు.

Floods in Crops In AP : వరద, కరవులతో నష్టపోతున్న వారిలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే. వైపరీత్యాలతో గింజ చేతికి రాక అప్పులు తీర్చలేక సాగుకే దూరమవుతున్నారు. కోనసీమ, పశ్చిమగోదావరి, బాపట్ల తదితర జిల్లాల్లో రైతులు ఖరీఫ్ పంట వేయడమే మానుకున్నారు. రాష్ట్రంలో వరి విస్తీర్ణం తగ్గడమే దీనికి నిదర్శనం. రబీలో వర్షాలు తక్కువగా ఉంటాయని, కొంతైనా లాభదాయకంగా ఉంటుందని నాట్లు వేస్తే ఇప్పుడూ అదే పరిస్థితి. ఏ పంట నష్టానికి అదే పంట కాలంలోపు పెట్టుబడి రాయితీ ఇవ్వడమే గొప్ప సాయంగా భుజాలు చరుచుకుంటున్న ప్రభుత్వం వాస్తవంగా ఎకరానికి ఎంత నష్టపోతున్నారు, ఇచ్చేదెంత? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

ఏపీని కుదిపేస్తున్న మిగ్‌జాం తుపాను - స్తంభించిన జనజీవనం, అన్నదాతల్లో ఆందోళన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.