ETV Bharat / state

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి: యూటీఎఫ్

author img

By

Published : Dec 12, 2022, 1:25 PM IST

Updated : Dec 12, 2022, 2:01 PM IST

UTF Fights With AP Govt For Teachers: రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను.. వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు, కార్యదర్శి డిమాండ్ చేశారు.. ఉపాధ్యాయులకు బదిలీల్లో అన్యాయం జరుగుతోందని ఆక్షేపించారు..

UTF
యూటీఎప్

UTF Fights With AP Govt For Teachers: ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టే విధంగా ప్రభుత్వం బదిలీలు చేపట్టిందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు నక్కా వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి ప్రసాద్ మండిపడ్డారు. ప్రభుత్వ తీరు వల్ల ఉపాధ్యాయులకు బదిలీల్లో అన్యాయం జరుగుతుందన్నారు. ప్రతి నెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లించేలా ఒత్తిడి తెస్తామని.. లేనిపక్షంలో భవిష్యత్‌ కార్యాచరణను ప్రకటిస్తామని స్పష్టంచేశారు.

ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కారించాలి: యూటీఎఫ్

బదిలీలపై ఉపాధ్యాయుల అభ్యంతరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లతామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 30 శాతం మంది ఉపాధ్యాయులకు ఇంకా జీతాలు ఇవ్వలేని ఇంతకంటే దారుణం మరొకటి ఉండదన్నారు. ఉపాధ్యాయులకు మొదటి తేదీనే జీతం చెల్లించడం ప్రభుత్వం బాధ్యతని, దాని నుంచి తప్పించుకుని కుంటి సాకులు చెప్పడం సిగ్గుచేటన్నారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న బదిలీల సమస్యలు, జీతాల అలస్యంపై కారణాలు తెలపాలని డిమాండ్ చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Dec 12, 2022, 2:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.