ETV Bharat / entertainment

వాల్తేరు వీరయ్య.. పవర్​ఫుల్​గా​ రవితేజ ఫస్ట్​ గ్లింప్స్​.. యాక్షన్, డైలాగ్స్​ అదిరిపోయాయ్​!

author img

By

Published : Dec 12, 2022, 12:04 PM IST

చిరంజీవి వాల్తేరు వీరయ్యలో కీలక పాత్రలో నటించిన రవితేజకు సంబంధించిన టీజర్​ను రిలీజ్​ చేసింది మూవీటీమ్​. ఆ వీడియో అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది.

Valteru veerayya Raviteja first glimpse
వాల్తేరు వీరయ్య.. పవర్​ఫుల్​ రవితేజ ఫస్ట్​ గ్లింప్స్​.. చూస్తే పూనకాలే

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన చిత్రం వాల్తేరు వీరయ్య. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా వాల్తేరు వీరయ్యలో ఓ కీలక పాత్రలో నటించిన రవితేజ టీజర్ ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. మేకపిల్లను పట్టుకొని రౌడీల భరతం పడుతోన్న రవితేజ వాల్తేర్ వీరయ్య మాస్ ఎంటర్ టైనర్ గా ఎలా ఉండబోతుందో చూపించాడు. గతంలో అన్నయ్య చిత్రంలో చిరంజీవి తమ్ముడిగా నటించిన రవితేజ... మళ్లీ చాలా కాలం తర్వాత తెరను పంచుకోవడంతో అటు మెగా అభిమానులు, ఇటు రవితేజ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.