ETV Bharat / state

నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం: టీడీపీ నిజ నిర్ధరణ కమిటీ

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 12, 2023, 9:23 PM IST

TDP Leaders Met the Farmers Affected by Cyclone Michaung : ఉల్లిగడ్డకు, ఆలుగడ్డకు తేడా తెలియని అసమర్థ ముఖ్యమంత్రి రాష్ట్రాన్ని పాలిస్తున్నారని తెలుగుదేశం నేతలు మండిపడ్డారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పంట నష్టాన్ని అంచనా వేసేందుకు టీడీపీ నిజ నిర్ధరణ కమిటీ బృందాలు అనేక చోట్ల పర్యటించాయి. నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని నేతలు విమర్శించారు.

TDP_Leaders_Met_the_Farmers_Affected_by_Cyclone_Michaung
TDP_Leaders_Met_the_Farmers_Affected_by_Cyclone_Michaung

తుపాను ప్రభావిత ప్రాంతాల్లో టీడీపీ నిజనిర్ధరణ కమిటీ పర్యటన

TDP Leaders Met the Farmers Affected by Cyclone Michaung : మిగ్‌జాం తుపాను కారణంగా నష్టపోయిన రైతుల పంట పొలాలను టీడీపీ నేతలు పరిశీలించారు. వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించారు. తుపాను ప్రభావంతో తీవ్ర వర్షాలు కురిసి రాష్ట్ర వ్యాప్తంగా 25 లక్షల ఎకరాల్లో వరి పంట దెబ్బతింటే కనీసం రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపటం లేదని విమర్శించారు.

సీఎం జగన్‌ చెప్పే మాటల్లో ఉన్న తియ్యదనం చేతల్లో కనిపించట్లేదు: ఏరాసు ప్రతాప్​రెడ్డి

TDP Leaders Visited the Farmers in Prakasam District : ప్రకాశం జిల్లా కనిగిరి మండలంలో తుపాను ధాటికి దెబ్బతిన్న వరి, మిర్చి, పొగాకు పంటలను నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ ఉగ్ర నరసింహారెడ్డి, మాజీమంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి ఇతర టీడీపీ బృంద సభ్యులతో కలసి పరిశీలించారు. పంట నష్టపోయి దిక్కుతోచని స్థితిలో కన్నీరు పెడుతున్న రైతన్నలను ప్రభుత్వం ఆదుకునే ప్రయత్నం చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్నాడు జిల్లా మానుకొండవారిపాలెంలో తుపానుకు దెబ్బతిన్న శనగ, పొగాకు, మిరప, వరి పంటలను టీడీపీ బృందం పరిశీలించింది. పంట నష్టం వివరాలను రైతులను అడిగి తెలుసుకున్నారు.

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులకు కష్టాలు - వైసీపీ సర్కార్​పై టీడీపీ ఫైర్​

TDP Leaders Visited Farmers in NTR District : ఎన్టీఆర్ జిల్లా హెచ్. ముత్యాలంపాడులో నీట మునిగిన పంట పొలాలను పార్టీ నాయకులతో కలసి మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పరిశీలించారు. పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు, గుమ్మడిదూరు, ముచింతాలలో దెబ్బతిన్న వరి, మిర్చి పంటలను తెలుగు దేశం నేతలు శ్రీరామ్‌ తాతయ్య, గద్దె రామ్మోహన్‌, జనసేన, సీపీఐ నేతలతో కలసి పరిశీలించారు. నష్టపోయిన రైతులకు పరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోందని నేతలు మండిపడ్డారు.

పంట నష్టంపై రైతులకు భరోసా ఏదీ - మొలకెత్తిన వరి పనలతో నిరసన

TDP Leaders Visited Farmers in West Godavari District : పశ్చిమగోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలోని అనేక గ్రామాల్లో తడిసిపోయిన ధాన్యాన్ని, వర్షాలకు నేలకొరిగిన పంటలను మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ ఆధ్వర్యంలో నేతలు పరిశీలించారు. ధాన్యం విక్రయంలో తలెత్తుతున్న సమస్యలను రైతులను అడిగి తెలుసుకున్నారు. అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం పలివెల, అవిడి, గంటి గ్రామాల్లో తుపానుతో దెబ్బతిన్న పంటలను మాజీ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, టీడీపీ సీనియర్‌ నేత గోరంట్ల బుచ్చయ్యచౌదరి తదితరులు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, నీటి పారుదల రంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని నేతలు ఆరోపించారు.

TDP Leaders Demand Compensation to Farmers : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు మండలం అనిగండ్లపాడు, గుమ్మడిదూరు, ముచింతాల గ్రామాల్లో మిగ్ జాం తుఫాను తీవ్రతకు పంట నష్టపోయిన ప్రాంతాలను తెలుగుదేశం పార్టీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ తాతయ్య, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, రాష్ట్ర తెలుగు రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, అధికార ప్రతినిధి కేఎస్ఎన్ ప్రసాద్, జనసేన, సీపీఐ నాయకులతో కలిసి పరిశీలన చేశారు.

రైతులను నట్టేట ముంచిన జగన్ - నాలుగున్నరేళ్లలో ఒక్క టార్పాలిన్‌నూ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.