ETV Bharat / state

రైతులను నట్టేట ముంచిన జగన్ - నాలుగున్నరేళ్లలో ఒక్క టార్పాలిన్‌నూ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 10, 2023, 7:18 AM IST

YSRCP_Government_Not_Giving_Tarpaulin_to_Farmers
YSRCP_Government_Not_Giving_Tarpaulin_to_Farmers

YSRCP Government Not Giving Tarpaulin to Farmers: సీఎం జగన్‌ మాట్లాడితే తమది రైతు ప్రభుత్వమని గొప్పలకు పోతారు. అన్నదాత సంక్షేమం కోసం అది చేస్తన్నాం. ఇది చేస్తున్నామని ఊదరగొడతారు. కానీ వాస్తవ పరిస్థితులు చూస్తే మాత్రం నాలుగున్నరేళ్లలో ఒక్కరైతుకు కూడా టార్పాలిన్‌ ఇచ్చిన దాఖలాలు లేవు. పంటను ఆరబెట్టుకోవడానికి, వర్షం నుంచి రక్షించుకోవడానికి రైతులు సొంతంగా కొనుగోలు చేసుకొనో, అద్దెకు తెచ్చుకునో నానా తిప్పులు పడుతున్నారు. మిగ్‌జాం తుపాను సమయంలోనూ ప్రభుత్వం ఇదే నిర్లక్ష్యంతో వ్యవహరించడంతో రైతులు నిండామునిపోయారు.

రైతులను నట్టేట ముంచిన జగన్-నాలుగున్నరేళ్లలో ఒక్క టార్పాలిన్‌నూ ఇవ్వని వైసీపీ ప్రభుత్వం

YSRCP Government Not Giving Tarpaulin to Farmers : యంత్రాలతో కోసిన ధాన్యాన్ని ఆరబెట్టాలంటే రైతులకు ఎక్కడా ప్లాట్‌ఫాంలు లేవు. ఎకరాకు 3 లక్షల పెట్టుబడి పెట్టే మిరప పరిస్థితీ అంతే. రహదారులపైకో, ఖాళీగా ఉన్న పొలాల్లోకో వెళ్లాల్సిందే. ప్రభుత్వం చెబుతున్నట్లు ధాన్యాన్ని 17 శాతం తేమ స్థాయికి తేవాలంటే కనీసం వారం నుంచి పది రోజులు ఆరబెట్టాలి. ఒక్కో బరకాకు అద్దె రోజుకు 30 నుంచి 40 రూపాయల వరకు ఉంటుంది. ఎకరంలో ధాన్యం ఆరబెట్టాలంటే కనీసం అయిదు బరకాలు కావాలి. అంటే రోజుకు 150 రూపాయలు అలా వారం పాటు ఆరబెట్టడానికి 1,050 ఖర్చవుతుంది. ఎకరా పొలంలో పండే ధాన్యాన్ని తడవకుండా కాపాడుకోవాలంటే 10 వేల ఖర్చుతో టార్పాలిన్ కొనాలి. కల్లాల్లో ఆరబెట్టిన మిరప కాపాడుకోవాలన్నా, భారీ వర్షం నుంచి ధాన్యం రాశుల్ని కాపాడుకోవాలన్నా టార్పాలిన్లు కావాల్సిందే. అందుకే రైతులు వీటిని తీసుకునేందుకు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

Farmers Problems with Michaung Cyclone : అప్పులు జేసి అప్పటికే పలురకాలుగా పెట్టుబడి పెట్టే రైతు చివరి దశలో బరకాలను కొనలేకనే ప్లాస్టిక్ గోతాలతో చేసిన పరదా పట్టాల్ని కప్పి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయినా వర్షపు నీరు ఆగడం లేదు. రాశులు, మిరప కుప్పల కిందకు నీరు చేరుతోంది. ఫలితంగా రైతులు ఏటా పెద్ద ఎత్తున నష్టపోతున్నారు. తాజాగా మిగ్‌జాం తుపాను (Michaung Cyclone) ధాటికి కుదేలయ్యారు. కొన్నిచోట్ల ధాన్యం, మిరప నీటిలో తేలియాడే పరిస్థితి ఉంది. ఒకేసారి అవసరమయ్యే సరికి డిమాండ్ పెరిగి బరకాలు అద్దెకు కూడా దొరకడం లేదని రైతులు చెబుతున్నారు.

కరవు నష్టం కొండంత - ప్రభుత్వ సాయం గోరంత! 'నలిగిపోతున్న రాష్ట్ర రైతులు'

Michaung Cyclone in AP : ఆరుగాలం శ్రమించే అన్నదాతకు పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాలను తట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి ముందస్తు సన్నద్ధత ఒక్కటే మార్గం. ముఖ్యంగా వారికి టార్పాలిన్లు అందిస్తే ధాన్యం, మిరప లాంటి వాటిని వర్షాల నుంచి రక్షించుకోవచ్చు. 59 వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశామని గొప్పలు చెప్పే జగన్ 200 కోట్లు ఖర్చు పెట్టి రైతులకు టార్పాలిన్లు ఇచ్చేందుకు మాత్రం ససేమిరా అంటున్నారు.

CM Jagan Negligence on Farmers : తమ నిర్లక్ష్యం ఫలితంగా వరి రైతులు ఎంత మునుగుతున్నారో వర్షాలు, వరదల సమయంలో ఎంతగా నష్టపోతున్నారో కూడా ప్రభుత్వం గుర్తించడం లేదు. నాలుగేళ్ల తర్వాత నిద్ర మేలుకొని అక్టోబరులో ఇస్తున్నాం. నవంబరులో ఇస్తున్నామంటూ రైతుల్ని ఆశపెట్టారు. తీరా అదీ అమలు చేయలేదు. ఫలితంగా మిగ్‌జాం తుపానుతో రైతులు నిండా మునిగిపోయారు. పంటల్ని కాపాడుకునేందుకు పడరానిపాట్లు పడుతున్నారు. పది వేల రూపాయల విలువైన టార్పాలిన్ను 50శాతం రాయితీపై కూడా ఇవ్వలేరా అని వాపోతున్నారు.

మిగ్​జాం తుపానుతో డీలా పడ్డ రైతన్న- పరిహారమన్నా ఇయ్యన్నా జగనన్న!

TDP Govt Subsidy to Farmers For Tarpaulins : తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రైతులకు ఏటా టార్పాలిన్లను 50 శాతం రాయితీపై అందించారు. ఏడాదికి 400 కోట్ల రూపాయల వరకు దీనికి వ్యయం చేశారు. దాంతో రైతులకు ఆర్థిక భారం తప్పేది. మార్కెటింగ్ శాఖ కూడా రైతులకు టార్పాలిన్లను రాయితీపై ఇచ్చేది. ఒకసారి తీసుకుంటే రెండు, మూడు సీజన్ల వరకు ఉపయోగపడేవి. రాయితీ టార్పాలిన్లతో సన్నచిన్న కారు రైతులకు ఎంతో ప్రయోజనం కలిగింది.

YCP Govt Did Not Give Subsidy to Farmers For Tarpaulins : వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక 2019 నుంచి టార్పాలిన్లపై రాయితీ ఊసే లేదు. వ్యక్తిగత యాంత్రీకరణ పథకానికి మంగళం పాడేసింది. 2023-24 సంవత్సరంలో ఇస్తామంటూ ఊరించారు. తర్వాత ఖరీఫ్‌లో ఇస్తామని చెప్పారు. సెప్టెంబరు గడచినా ఒక్కరికీ అందలేదు. అనంతరం అక్టోబరు, నవంబరులో ఇస్తామంటూ నమ్మబలికారు. డిసెంబరు వచ్చినా నోరెత్త లేదు. ఫలితంగా ఇప్పుడు రైతులు నిండా మునిగిపోయారు.

సీఎం జగన్ దూరం నుంచే పంటలను పరిశీలించారు - తమను ఎవరు ఆదుకుంటారు! బోరున విలపించిన మిర్చి రైతు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.