ETV Bharat / state

Registration Charges Hike: రిజిస్ట్రేషన్ ఛార్జీలపై ప్రభుత్వం పునరాలోచించాలి: నజీర్‌అహ్మద్‌

author img

By

Published : Jun 7, 2023, 3:41 PM IST

Registration Charges Hike in AP: జగన్ ప్రభుత్వం 4ఏళ్లలో 6 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం మోపిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాల వల్ల ఇప్పటికే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు కుదేలయ్యాయన్నారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని నజీర్‌ అహ్మద్‌ కోరారు.

TDP Leader Naseer Ahmed
TDP Leader Naseer Ahmed

TDP Leader Naseer Ahmed: రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం మోపిందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్​ ఆపించారు. జగన్ ప్రభుత్వం 4ఏళ్లలో 6 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచిందన్నారు. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నెలవారీ టార్గెట్లు విధిస్తూ ప్రభుత్వం ప్రజల్ని దారుణంగా దోచుకుంటోందని మొహమ్మద్ నజీర్ మండిపడ్డారు. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆస్తి, భూముల క్రయవిక్రయాలు ప్రభుత్వ నిర్ణయంతో మరింత మందగిస్తాయన్నారు. కొత్త జిల్లాలను ప్రకటించిన ప్రభుత్వం ఆయాప్రాంతాల్లో మౌలిక వసతులు కల్పించకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ప్రజల్ని దోచుకోవడం కాదా అని దుయ్యబట్టారు. రాజధాని లేని రాష్ట్రంలో ఇప్పటికే రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు కుదేలయ్యాయన్నారు. గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ ఛార్జీలపై ప్రభుత్వం పునరాలోచన చేయాలని నజీర్‌ అహ్మద్‌ కోరారు.

4ఏళ్లలో 6 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు...: ఇప్పటికే రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ ఉమ్మడిగా ఉన్న నిర్మాణాల విలువల జాబితా (స్ట్రక్చరల్‌) నుంచి వాణిజ్య సముదాయాల పేరుతో కొత్త కేటగిరీని తీసుకువచ్చింది. గ్రామీణ, పట్టణాలు అనే తేడాలు లేకుండా... పెంచిన కొత్త విలువలు జూన్‌ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. వెయ్యి చదరపు అడుగుల ప్లాట్‌ కొనుగోలు చేస్తే దాని కోసం చెల్లించే రిజిస్ట్రేషన్‌ ఛార్జీల రూపేణా గతంలో కంటే అదనంగా రూ.15 వేల వరకు ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది. మార్కెట్‌ విలువ అదనంగా రూ.2 లక్షలు రూ.1,200 నుంచి రూ.14,00కు పెంచడంతో... ఈ భారం పెరిగింది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రిజిస్ట్రేషన్‌ శాఖ ఇప్పటివరకు ఆరు సార్లు రిజిస్ట్రేషన్‌ ఫీజ్​లను పెంచింది. గత సంవత్సరం ఫిబ్రవరి ఒకటిన పల్నాడు, బాపట్ల గుంటూరు జిల్లా కేంద్రాల్లో మార్కెట్‌ అమాంతంగా పెంచారు.

ఈ సంవత్సరం ఏప్రిల్‌లో 11 కొత్త జిల్లా కేంద్రాలు, ఆ జిల్లాల చుట్టుపక్కల ఉండే ప్రాంతాల్లో మార్కెట్‌ విలువలతో పాటుగా... జాతీయ రహదారులు, సమీపంలో పరిశ్రమలు, దుకాణాలు, ఇతరరత్ర అంశాల ప్రతిపాదికగా ప్రభుత్వం 13% నుంచి 75% వరకు పెంచింది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి యూజర్‌ ఛార్జీలు పెరిగాయి. ప్రభుత్వం జూన్‌ ఒకటి నుంచి మరో మారు ఎంపికచేసిన గ్రామాల్లో భూముల విలువలను సవరించింది. అయితే, నిర్మాణాల స్ట్రక్చర్‌ మార్కెట్‌ విలువలను రాష్ట్రవ్యాప్తంగా పెంచారు. గతేడాది జూన్‌ 1b తేదీనే ఈ ఫీజులు పెరిగాయి. మిల్లులు, కర్మాగారాలు, సినిమా హాళ్లు, కోళ్లఫారాల భవన నిర్మాణాలపై సైతం భారం వేశారు. రెల్లుగడ్డితో కప్పే గుడిసెలు, తాటాకు, కొబ్బరాకులతో కప్పె గడిసెలను సైతం వదలలేదు. చదరపు అడుగుకు అదనంగా రూ.10 చొప్పున అదనంగా బాదేశారు. గ్రామీణ, పట్టణాలనే తేడా లేకుండా.. ప్రభుత్వం గత విలువలపై సగటున 5% చొప్పున పెంచారు.

టీడీపీ అధికార ప్రతినిధి మహమ్మద్ నసీర్ అహ్మద్

'రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుతో ప్రభుత్వం సామాన్య, మధ్యతరగతి వర్గాలపై పెనుభారం మోపింది. జగన్ ప్రభుత్వం 4ఏళ్లలో 6 సార్లు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచింది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు నెలవారీ టార్గెట్లు విధిస్తూ ప్రభుత్వం ప్రజల్ని దారుణంగా దోచుకుంటోంది. అసలే అంతంతమాత్రంగా ఉన్న ఆస్తి, భూముల క్రయవిక్రయాలు ప్రభుత్వ నిర్ణయంతో మరింత మందగిస్తాయి. కొత్త జిల్లాలను ప్రకటించిన ప్రభుత్వం ఆయాప్రాంతాల్లో మౌలికవసతులు కల్పించకుండా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం ప్రజల్ని దోచుకుంటుంది. రియల్ ఎస్టేట్, నిర్మాణ రంగాలు కుదేలయ్యాయి. గ్రామీణ, సబర్బన్ ప్రాంతాల్లోని రిజిస్ట్రేషన్ ఛార్జీలపై ప్రభుత్వం పునరాలోచనచేయాలి.'- మహమ్మద్ నసీర్ అహ్మద్​, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.