ETV Bharat / state

అమరావతి రాజధానిపై నేడు సుప్రీం కోర్టులో విచారణ..

author img

By

Published : Nov 1, 2022, 10:23 AM IST

SC on Amaravati Capital: అమరావతి రాజధాని వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ప్రభుత్వం, అమరావతి రైతులు వేరువేరుగా దాఖాలు చేసిన పిటిషన్లపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. హైకోర్టు తీర్పును సవాల్​ చేస్తూ ప్రభుత్వం సుప్రీం కోర్టులో గతంలోనే పిటిషన్​ దాఖాలు చేసింది.

Supreme Court
సుప్రీంకోర్టు

SC on Amaravati Capital: అమరావతి రాజధాని వ్యవహారంపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.అమరావతి రైతులు, ప్రభుత్వం దాఖలు చేసిన వేరు వేరు పిటిషన్లపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ యూయూ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. అమరావతి రాజధానిగా కొనసాగించాలన్న హైకోర్టు తీర్పును.. రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్‌లో సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. 2 వేల పేజీలతో కూడిన స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. అమరావతే రాజధాని అంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును నిలిపివేయాలని కోరిన రాష్ట్ర ప్రభుత్వం రాజధానిపై ఎలాంటి చట్టాలు చేసే అధికారం అసెంబ్లీకి లేదంటూ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు శాసన వ్యవస్థను నిర్వీర్యం చేయడమేనని పేర్కొంది. హైకోర్టు తీర్పుపై వెంటనే స్టే ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

సీఆర్​డీఏ చట్టం ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించాలని హైకోర్టు సూచించడం శాసనసభ అధికారాలను ప్రశ్నించడమేనన్న రాష్ట్ర ప్రభుత్వం.. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులను ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో పేర్కొంది. సీఆర్​డీఏ ఒప్పందం ప్రకారం ఆరు నెలల్లో అమరావతిని అభివృద్ధి చేయాలంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయడం సాధ్యం కాదని పిటిషన్లో ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే తమ వాదన కూడా పరిగణనలోకి తీసుకోవాలని.. రాజధాని పరిరక్షణ సమితి నేతలు, రైతులు కెవియేట్ పిటిషన్లు దాఖలు చేశారు. అలాగే రాజధానిగా అమరావతిని కొనసాగించాలని హైకోర్టు ఇచ్చిన తీర్పులో కొన్ని ప్రధాన అంశాలపై స్పష్టత లేదని సుప్రీంకోర్టులో పలువురు రైతులు పిటిషన్‌ దాఖలు చేశారు. తీర్పులో ప్రస్తావించిన అంశాలతోపాటు.. తాము లేవనెత్తిన విషయాలు కూడా పొందుపరిచేలా చూడాలని రైతులు విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం, రైతులు దాఖలు చేసిన పిటిషన్​లను వేరు వేరుగా విచారణ కేసుల జాబితా లో సుప్రీంకోర్టు రిజిస్ట్రీ ప్రకటించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.