ETV Bharat / state

ఒక్కో ఓటుకు 5 వేల రూపాయలిచ్చి గెలిచాం... సర్వసభ్య సమావేశంలో బయటపడ్డ నిజాలు

author img

By

Published : Nov 1, 2022, 8:27 AM IST

Kuppam
కుప్పంలో వైకాపా రాజకీయాలు

Kuppam: కుప్పంలో ఒక్కో ఓటుకు 5 వేల రూపాయలిచ్చి గెలిచాం.! ఈ మాట అన్నది ఎవరో కాదు.. వైకాపా నేతే..! చెప్పింది ఎక్కడో కాదు ఏకంగా పురపాలక సర్వసభ్య సమావేశంలోనే! అన్నది ఎవరితోనే కాదు స్వయంగా మున్సిపల్‌ కమిషనర్‌తోనే.! ఔను.. పనుల్లేవు, బిల్లులు లేవంటూ అధికార పార్టీ నేతలే కుప్పం పురపాలక సమావేశంలో కస్సుమన్నారు.

కుప్పంలో వైకాపా రాజకీయాలు

Kuppam : విన్నారుగా కుప్పంలో ఒక్కో ఓటుకు 5 వేలు ఖర్చు పెట్టి గెలిచారట. ఏమాత్రం మొహమాటం లేకుండా చెప్తున్న ఈయన... కుప్పం మున్సిపాలిటీ 17వ వార్డు కౌన్సిలర్‌ దేవకి భర్త రంగయ్య.! పురపాలక సర్వసభ్య సమావేశానికి హాజరయ్యారు. ఎలా అనుమతిచ్చారన్నది కాసేపు పక్కనబెడితే భార్య తరఫున వచ్చిన రంగయ్య సమావేశంలో అసలు గుట్టువిప్పారు. మున్సిపాలిటీలో తమకు ఎలాంటి పనులు కేటాయించడం లేదని కమిషనర్‌ను ప్రశ్నించారు. ఇటీవలే 800 రూపాయలు బిల్లు పాస్‌ చేశామని కమిషనర్‍ బదులివ్వడంతో రంగయ్య ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇంత చిన్న పనులా కేటాయించేదంటూ కోపగించుకున్నారు.

రంగయ్య, కుప్పం 17వ వార్డు కౌన్సిలర్‌ భర్త

రంగయ్య: మనం ఫస్ట్ పనిచేయాల్సింది ప్రజలకి.

రంగయ్య: నాకూ బాధ్యత ఉంది కదా.

రంగయ్య: ఈ సిటీలో పనులైనా చేయలేదని కంప్లైంట్‌ పోతే నేను అక్కడ ఉన్నట్టా లేనట్టా.

కమిషనర్: ఇంతకుముందు రూ.800 ఖర్చుపెట్టారు ఆరోజు నేను మీకు డబ్బులిచ్చా.

రంగయ్య: ఏదో ధర్మానికిచ్చినట్లు, నాకు ఇచ్చినట్లు మాట్లాడతారేంటి?

రంగయ్య: ఒక్క ఓటుకు రూ.5వేలు ఇచ్చినాం అక్కడ.

రంగయ్య: మీరు అది మర్చిపోయి మాట్లాడొద్దు.

ఇక పులివెందులతో సమానంగా కుప్పంను అభివృద్ధి చేస్తానని సీఎం జగన్‌ ఇటీవల వైకాపా నియోజకవర్గ సమీక్షలో నాయకులకు చెప్పారు. కానీ అక్కడ పనులు జరగడంలేదని పురపాలిక సర్వసభ్య సమావేశంతో తేలిపోయింది. అభివృద్ది పనుల కోసం గతంలో నిర్వహించిన టెండర్ల పనులు... ఇప్పటి వరకు ప్రారంభం కాలేదని, అలాంటప్పుడు సమావేశాలు ఎందుకంటూ ఏకంగా మున్సిపల్‍ వైస్‍ చైర్మన్‍ మునుస్వామి సమావేశాన్ని బహిష్కరించారు.

మునుస్వామి, కుప్పం మున్సిపల్‍ వైస్‍ చైర్మన్‍

మునుస్వామి: 5 నెలలు రూ.10 లక్షలకు వడ్డీ కడుతున్నా.

మునుస్వామి: ఇదీ మన బతుకు

మునుస్వామి: అప్పిచ్చే వాడు నేను పోతే చెప్పుతో కొడతాడు.

మరోవైపు పట్టణంలో అభివృద్ది కార్యక్రమాలకు సంబంధించిన తీర్మానాలు చేయాలని మున్సిపల్‌ చైర్మన్‍ సుధీర్‍ ప్రతిపాదించగా వైకాపా కౌన్సిలర్లు సమావేశ మందిరం నుంచి వెళ్లేందుకు యత్నించారు. చైర్మన్‍ వారికి నచ్చచెప్పే ప్రయత్నం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.