విజయవాడలో ఆర్టీసీ బస్సు బ్రేక్​ ఫెయిల్​.. గోడను ఢీకొట్టి

author img

By

Published : Feb 1, 2023, 8:02 PM IST

RTC BUS

RTC Bus Accident: ఆర్టీసీ బస్సు బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో బస్సు అదుపు తప్పి సిగ్నల్ వద్ద ఉన్న ఓ ప్రముఖ హోటల్ ప్రహరీ గోడను ఢీకొట్టిన ఘటన విజయవాడ గవర్నర్​పేటలో జరిగింది. కాగా ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. నిర్వహణ లోపంతో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు.

RTC Bus Accident: విజయవాడ గవర్నర్​పేటలోని ఏలూరు రోడ్డు కూడలి వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలైన ఘటన జరిగింది. బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో బస్సు అదుపు తప్పి.. సిగ్నల్ వద్ద ఉన్న ఓ ప్రముఖ హోటల్ ప్రహరీ గోడను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్నా ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంలో హోటల్ ప్రహరీ గోడ పూర్తిగా దెబ్బతింది.

గోడ హోటల్లో పార్కు చేసిన కారుపైకి ఒరిగిపోయింది. దీంతో కారు స్వల్పంగా దెబ్బతింది. ఆర్టీసీ బస్సులు నిర్వహణ లోపంతో ఇటీవల కాలంలో ఈ తరహా ఘటనలు అధికంగా జరుగుతున్నాయని ప్రజలు అంటున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.