ETV Bharat / state

వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య.. సినిమాలు ఘన విజయం సాధించాలి: నారా లోకేశ్

author img

By

Published : Jan 11, 2023, 8:44 PM IST

Updated : Jan 11, 2023, 9:11 PM IST

Lokesh Wishes CHIRU Balayya Movies
నారా లోకేశ్

సంక్రాంతికి ప్రేక్షకుల‌కు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వ‌స్తున్న బాల మావ‌య్య, వాల్తేరు వీర‌య్యగా వ‌స్తున్న చిరంజీవికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ స‌న్నద్ధమైందని మండిపడ్డారు. మ‌న‌మంతా ఒక్కటే. కులం, మ‌తం, ప్రాంతం ఏవీ మ‌న‌ల్ని విడ‌దీయ‌లేవని ట్విటర్ ద్వారా వెల్లడించారు.

Lokesh Wishes to Chiru, Balayya Movies : ఎప్పుడు రాజకీయ ప్రత్యర్థులపై పంచులు వేసే నారా లోకే​శ్ ఈసారి తనకు పిల్లనిచ్చిన మామ సినిమా విడుదలపై స్పందించారు. నిత్యం జనాలతో ఉంటూ వారి సమస్యలపై స్పందించే లోకేశ్ అటు బాలయ్యతో పాటుగా చిరంజీవి సినిమా సైతం విజయవంతం కావాలని కోరుకున్నట్లు తెలిపారు. లోకేశ్ తరఫు నుంచి ఈ తరహా ట్వీట్ రావడంపై అటు బాలయ్య అభిమానులు ఇటు చిరంజీవి అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. గత కొంత కాలంగా అభిమానుల్ని కులాలు, మతాలు, ప్రాంతాలుగా విడగొట్టే ప్రయత్నాలు చేసేవారి మాయలో పడవద్దంటూ సందేశాన్నిచ్చారు.

వీరసింహారెడ్డి, వాల్తేరు వీర‌య్యకు శుభాకాంక్షలు: సంక్రాంతికి ప్రేక్షకుల‌కు వినోదం పంచేందుకు వీరసింహారెడ్డిగా వ‌స్తున్న బాల మావ‌య్య, వాల్తేరు వీర‌య్యగా వ‌స్తున్న చిరంజీవికి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు సినిమాలు మంచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. అల‌రించే పాట‌లు, ఆలోచింప‌జేసే మాట‌లు, ఉర్రూత‌లూగించే డ్యాన్సుల‌తో పూర్తిస్థాయి వినోదం అందించే ఈ చిత్రాల‌ను కోట్లాది ప్రేక్షకుల‌లో ఒక‌డిగా తానూ చూడాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్నానని లోకేశ్ స్పష్టంచేశారు. హీరోల పేరుతో, కులాల పేరుతో ఫేక్ పోస్టులు సృష్టించి విద్వేషాలు రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ స‌న్నద్ధమైందని మండిపడ్డారు.

ఇద్దరు అగ్రహీరోల సినిమాలు విడుద‌లవుతున్న సంద‌ర్భాన్ని వాడుకుని సోష‌ల్ మీడియాలో విష‌ప్రచారాలు చేసి కుల‌, మ‌త‌, ప్రాంతాల మ‌ధ్య విద్వేషాలు ర‌గిల్చిన దుష్ట చ‌రిత్ర గ‌లిగినవారి ట్రాప్‌లో ఎవ‌రూ ప‌డొద్దని సూచించారు. సినిమాలు అంటే వినోదం. సినిమాల‌ను వివాదాల‌కు వాడుకోవాల‌నే అధికార పార్టీ కుతంత్రాల‌ను తిప్పికొట్టాలన్నారు. మ‌న‌మంతా ఒక్కటే. కులం, మ‌తం, ప్రాంతం ఏవీ మ‌న‌ల్ని విడ‌దీయ‌లేవని ఉద్ఘాటించారు.

సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న సినిమాలు: ఈ సంక్రాంతికి అటు బాలకృష్ణ సినిమాతో పాటుగా, మెగాస్టార్ చిరంజీవి చిత్రం విడుదల కాబోతున్న నేపథ్యంలో పెద్ద సినిమాలకు పోటీ ఎందుకంటూ చాలా సినిమాలు ఇప్పటికే సంక్రాంతి బరి నుంచి తప్పుకున్నాయి. అలాగే తమిళ, హిందీ సినిమాలు సైతం రెండు సినిమాలతో పోటీలో నిలబడగలమా... అనే సందేహంతో తమ విడుదల తేదీలను మార్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. విజయ్​ హీరోగా దిల్ రాజు నిర్మించిన వారసుడు సినిమా సైతం మెుదట సంక్రాంతి బరిలో నిలపాలని చూసినా రెండు సినిమాలతో పోటీ పడగలమా అనే అనుమానంతో నిర్మాత దిల్ రాజు విడుదల విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :Jan 11, 2023, 9:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.