ETV Bharat / state

Employees Issue: ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు: బొత్స సత్యనారాయణ

author img

By

Published : Apr 27, 2023, 10:11 PM IST

Employees Union Leaders: ఉద్యోగుల సంఘాల నేతలతో మంత్రి బొత్స సత్యనారాయణ అనధికార సమావేశం నిర్వహించారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు మంత్రి తెలిపారు. మే 1వ తేదీ నుంచి ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై జీవోలు జారీ అవుతాయని పేర్కొన్నారు. సీపీఎస్​కు చట్టబద్దత లేదన్న అంశంపై ఎవరో మాట్లాడితే తాను స్పందించలేనన్నారు.

Etv Bharat
Etv Bharat

Minister Botsa Satyanarayana: ఉద్యోగుల సంఘాల నేతలతో ఓ అనధికార సమావేశం జరిగిందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గత సమావేశంలో ఇచ్చిన హామీల పైన సీపీఎస్, ఉద్యోగులకు చెల్లించాల్సిన కాంట్రిబ్యూషన్, డీఏ ఆరియర్​లు తదితర అంశాలపై చర్చినట్లు మంత్రి వెల్లడించారు. మే 1వ తేదీ నుంచి ఉద్యోగులకు సంబంధించిన వివిధ అంశాలపై జీవోలు జారీ అవుతాయని పేర్కొన్నారు. త్వరలోనే కొత్త పే రివిజన్ కమిషన్ నియామకంపై నిర్ణయం తీసుకుంటామని బొత్స స్పష్టం చేసారు. కొన్ని ఉద్యోగ సంఘాల సామరస్య పూర్వకంగా మసలుకోవాలని హితవు పలికారు. ప్రభుత్వం ఎవరిపైనా వివక్ష చూపదు,.. ఉద్యోగులు అంతా కుటుంబ సభ్యులేనన్నారు. తమతో ఉన్న సంఘాలతోనే అనధికార సమావేశం పెట్టుకున్నామని తెలిపారు. రాష్ట్రంలో అమలు అవుతున్న సీపీఎస్​కు చట్ట బద్దత లేదన్న అంశంపై ఎవరో మాట్లాడితే తాను స్పందించలేనన్నారు.

బొప్పరాజు వెంకటేశ్వర్లు: ఉద్యోగులకు సంబధించిన డబ్బుని మాత్రమే ప్రభుత్వం చెల్లించిందని ఏపీ జెఏసి అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. చట్ట బద్దం గా ఉద్యోగులకు ఇవ్వాల్సిన 1800 కోట్ల బకాయిలు ఇంకా చెల్లించలేదని, అవి ఎప్పుడు చెల్లిస్తారో తెలియదన్నారు. పీఆర్సీ అరియర్​లు కూడా ఎంత ఇవ్వాలో లెక్కలు చూస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. కొత్త పే స్కేళ్లను ఆమోదించాలి.. కేవలం 4 కోట్ల అదనంగా చెల్లించాల్సి వస్తుందని నిలిపివేస్తారా అని ప్రశ్నించారు. పోలీసులు, వైద్యశాఖలో పని చేస్తున్న వారికి ఇచ్చే స్పెషల్ పేలకు కాల పరిమితి వద్దని చెప్పామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ పైనా స్పష్టత ఇవ్వలేదని వెల్లడించారు. కొత్త జిల్లాల హెడ్ క్వార్టర్లు లో 16 శాతం హెచ్ అర్ ఏ ఉత్తర్వులు ఇవ్వాలని కోరామని తెలిపారు. వార్డు, గ్రామ సచివాలయం బదిలీలు, సాధారణ బదిలీలపైనా త్వరలోనే నిర్ణయానికి వస్తామని మంత్రుల కమిటీ చెప్పిందని వివరించారు. ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చే వరకూ తమ ఉద్యమ కార్యాచరణ నిలిపేది లేదని స్పష్టం చేశారు. రేపు జరగాల్సిన రౌండ్ టేబుల్ సమావేశం యదావిధిగా కొనసాగుతుందన్నారు. తమ ఉద్యమ ఫలితంగానే రూ.5860 కోట్ల బకాయిలు డబ్బులు ఇచ్చారని చెప్పారు.

వెంకట రామిరెడ్డి: కొత్త డీఏపై రెండు, మూడు రోజుల్లో జీవో వచ్చే అవకాశం ఉందని సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట రామిరెడ్డి అన్నారు. 2023 మార్చి 7వ తేదీన జరిగిన సమావేశంలో రూ.3 వేల కోట్లు ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని, కానీ అంతకంటే ఎక్కువ మొత్తాన్ని చెల్లించినట్టుగా ప్రభుత్వం తెలియ జేసిందన్నారు. కానీ ఇవాళ జరిగిన మంత్రుల కమిటీ మీటింగ్​లో ఏం చెల్లింపులు చేశారో వివరాలు ఇచ్చారని పేర్కొన్నారు. జిపిఎఫ్ 2,110 కోట్లు, సీపీఎస్ కాంట్రిబ్యూషన్ 2, 443 కోట్లు, ఏపీ జీఎల్ఐ 443 కోట్లు, టిఎ, డీఏలు 239 కోట్లు, గ్రాట్యుటీ 289 కోట్లు, ఈ హెచ్ ఎస్ 108 కోట్లు విడుదల చేశారని చెప్పారు. 5820 కోట్ల రూపాయల మేర ఇప్పటి వరకూ ఉద్యోగులకు చెందిన బకాయిలు చెల్లించినట్లు ప్రభుత్వం చెప్పిందని వెల్లడించారు.

2023 జూలై నుంచి కొత్త పీఆర్సీ అమలు చేయాల్సి ఉన్నందున కొత్త కమిషన్ నియామకంపై చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారన్నారు. జూన్ నాటికి ప్రభుత్వ, ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ హెల్త్ కేర్ ట్రస్టుకు చెల్లింపులు చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 2004 కంటే ముందు పరీక్ష రాసి సీపీఎస్ అమలు అయ్యాక ఉద్యోగంలో చేరిన వారికి పాత పెన్షన్ అమలు చేసే అంశంపై కమిటీ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా అడుగులు

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.