ETV Bharat / state

'యువత జనసేన వైపు చూస్తోంది.. 12న మా బలమేంటో చూపిస్తాం'

author img

By

Published : Jan 4, 2023, 8:21 PM IST

Pothina Mahesh
పోతిన మహేశ్​

Pothina Mahesh Comments on YS Jagan : ముఖ్యమంత్రి జగన్​మోహన్​ రెడ్డిపై జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్​ విమర్శల వర్షం కురిపించారు. వాలంటీర్​ ఉద్యోగాలు ఇచ్చి.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. యువత జగన్​మోహన్​ రెడ్డికి గట్టిగా బుద్ధి చెప్పాలని అన్నారు.

Pothina Mahesh Comments on YS Jagan : యువతను అంధకారంలోకి నెట్టిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి అవసరం లేదని జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్​ ఆరోపించారు. రాష్ట్రంలో యువతకి ఉపాధి లేక జాబ్ క్యాలెండర్ లేక చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు. జనసేన ఈ నెల 12వ తేదీన శ్రీకాకుళంలో నిర్వహించే బహిరంగ సభ పోస్టర్​ను జనసేన అధికార ప్రతినిధి పోతిన మహేశ్​ విడుదల చేశారు.

'యువశక్తి' పేరుతో నిర్వహించే ఈ సభకు పోస్టర్​ను కార్యకర్తలతో కలిసి మహేశ్​ విజయవాడలో విడుదల చేశారు. వాలంటీర్​ ఉద్యోగాలు ఇచ్చి.. నాలుగు లక్షల ఉద్యోగాలు ఇచ్చానని ఘనంగా చెప్పుకుంటున్నారని దుయ్యబట్టారు. యువత జనసేన వైపు చూస్తుందని.. జనసేన బలమేంటో 12వ తేదీన తెలుస్తుందన్నారు. యువత జగన్​మోహన్ రెడ్డి ప్రభుత్వానికి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.