ETV Bharat / state

ఏడు ప్రధాన ఆలయాల్లో రూ.600 కోట్ల దోపిడీ : పోతిన మహేష్

author img

By

Published : Feb 24, 2023, 4:58 PM IST

PothinaMahesh
పోతిన వెంకట మహేష్

Endowment department: దేవాదాయ శాఖలో పచారీ సామాన్ల పేరు మీద అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని.. జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కనుసన్నల్లో ప్రధాన ఆలయాల్లో దోపిడీ అక్రమాలు చేస్తున్నారని మహేష్ వెల్లడించారు. అక్రమాలపై ప్రభుత్వం స్పందించకుంటే జనసేన పక్షాన ఉద్యమిస్తామని పోతినమహేష్‌ హెచ్చరించారు.

AP Endowment department: రాష్ట్రంలో ఏడు ప్రధాన ఆలయాల్లో పచారీ సామాన్ల‌ కాంట్రాక్టులో ఐదు వందల నుంచి ఆరు‌ వందల కోట్ల దోపిడీ జరుగుతోందని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. వైసీపీ నాయకులు, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ కనుసన్నల్లో ఈ అక్రమాలు చేస్తున్నారని వెల్లడించారు. సీఎం జగన్ ప్రోత్సాహం లేకుండా ఈ‌ దోపిడీ సాధ్యమా అంటూ ప్రశ్నించారు. ఆరు వందల కోట్ల కుంభకోణం చేశారంటే.. ఇందులో వైసీపీ పెద్దల సహకారం ‌లేదా అని ఎద్దేవా చేశారు. 2016లో ఒక సర్క్యులర్ ఆధారంగా దేవాదాయ మంత్రి నిబంధనలు మార్చారని మహేష్ గుర్తు చేశారు. వైసీపీ కాంట్రాక్టర్లకు‌ దోచి పెట్టడానికి పది కోట్ల టర్నోవర్ నిబంధన తెచ్చారని ఆరోపించారు. గతంలో ఐదు కోట్ల నిబంధనను ఎందుకు మార్చారని మహేష్ ప్రశ్నించారు.

భూపేష్, రూపేష్, మణికంఠ ఎంటర్ ప్రైజెస్ సంస్థలను ముందు పక్కన పెట్టాలన్నారు. హోల్​సేల్ కాకుండా 25శాతం లాభాలు వేసుకుని సరుకులు సరఫరా చేస్తున్నారన్నారు. ఒక యేడాదికి రూ.125-150కోట్లు ఈ కాంట్రాక్టర్లు కొట్టేస్తున్నారన్నారు. ఇదంతా జగన్ ఆదేశాలతో దేవాదాయ శాఖ మంత్రి ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆ ఇద్దరు కాంట్రాక్టర్ల కోసం నిబంధనలు మార్చింది వాస్తవమన్నారు. రివర్స్ టెండరింగ్ కూడా పెద్ద బూటకం... అది పేరుకేనన్నారు. గతంలో విచారించి తక్కువ ధరకు వచ్చే వారికే కాంట్రాక్టు అప్పగించేవారని, ఇప్పుడు అధికంగా‌ ఇచ్చే వారికి అడ్డగోలుగా అనుమతి ఇస్తారా అంటూ మండిపడ్డారు. కూరగాయలు కాంట్రాక్టుకు ఒక నిబంధన, సరుకులకు మరో నిబంధనా, ఇంత దోపిడీ జరుగుతుంటే నిఘా‌ విభాగం ఏం‌ చేస్తుందని ప్రశ్నించారు. ప్రభుత్వం స్పందించకుంటే జనసేన పక్షాన ఉద్యమిస్తామని పోతిన మహేష్‌ హెచ్చరించారు.

జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో ఐదు నుంచి ఆరు వందల కోట్ల కుంభకోణం జరుగుతోంది. వైసీపీ మద్దత్తుతో మంత్రి కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో దోపిడి జరుగుతుంది. కేవలం ఇద్దరు కాంట్రాక్టర్ల కోసం నిబంధనలు మార్చారు. ఈ విషయం జగన్​కు తెలియదా. 2016లో ఇచ్చిన సర్క్యూలర్ ఆధారంగా పచారి సరుకుల కాంట్రాక్టర్లకు దోచి పెట్టడానికి రూ.10 కోట్ల టర్నోవర్ నిబంధనలు తీసుకువచ్చారు. గతంలో ఉన్న రూ.5కోట్ల టర్నోవర్​ను.. ఇద్దురి కోసమే మార్చారు. ఒకే కాంట్రాక్టర్​ వేరువేరు ఆలయాలలో వేరువేరు రేట్లతో దోచుకుంటున్నారు.ఈ దోపిడిపై స్వామిజీలు సైతం స్పందించాలి. 75 రకాల సరుకులు ఒకే కాంట్రాక్టర్​కు ఇవ్వకుడదు. పోతిన వెంకట మహేష్, జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి

ఇవీ చదంవడి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.