ETV Bharat / state

CM on Animutyalu: నాడు-నేడుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేశాం: సీఎం జగన్

author img

By

Published : Jun 20, 2023, 1:36 PM IST

Updated : Jun 20, 2023, 2:57 PM IST

Jagannana Animutyalu program updates: రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలను నాడు-నేడు కార్యక్రమం ద్వారా మార్చేశామని ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో నిర్వహించిన 'జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమంలో తెలియజేశారు. పది, ఇంటర్‌లో రాష్ట్ర స్థాయిలో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు నగదు పురస్కారంతో పాటు సర్టిఫికేట్, మెడల్‌ ప్రదానం చేశారు.

CM
CM

నాడు-నేడు ద్వారా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మార్చేశాం..సీఎం జగన్

Jagannana Animutyalu program updates: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన విద్యార్థిని, విద్యార్థులు రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలనేదే తన లక్ష్యమని.. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. విజయవాడలోని ఏ కన్వెన్షన్ సెంటర్‌లో నేడు నిర్వహించిన 'జగనన్న ఆణిముత్యాలు' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. పదవ తరగతి, ఇంటర్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సత్కరించి.. నగదు పురస్కారాలతోపాటు అవార్డులు, సర్టిఫికెట్, మెడల్‌ ప్రదానం చేశారు.

మా ప్రభుత్వ లక్ష్యం అదే..!: ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో.. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన విద్యార్థులు పోటీ పడాలనేదే తన లక్ష్యమన్నారు. ప్రైవేటు పాఠశాలతో పోటీ పడేలా.. ప్రభు‌త్వ బడుల రూపురేఖలను దాదాపుగా మార్చామన్నారు. గత నాలుగేళ్లుగా విద్యా సంస్కరణలను అమలు చేస్తున్నామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని అన్నీ పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి సిలబస్‌ను అమలు చేయనున్నామన్నారు.

ఆధునిక రీతిలో పాఠ్యాంశాలను బోధిస్తున్నారు: నాలుగేళ్లుగా రాష్ట్రంలో విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నామని.. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆధునిక రీతిలో ఉపాధ్యాయులు పాఠ్యాంశాలను బోధిస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్ర విద్యార్థులు పోటీ పడాలనే తపనతో తమ ప్రభుత్వం పని చేస్తుందని జగన్ పేర్కొన్నారు. త్వరలో ఏపీలోని పాఠశాలల్లో అంతర్జాతీయ స్థాయి సిలబస్ అమలు చేయనున్నామన్నారు.

సర్కారీ బడుల రూపు రేఖలు మార్చేశాం.. అంతేకాకుండా, పరీక్షా విధానంలోనూ ఇప్పటికే మార్పులు చేశామని సీఎం జగన్ గుర్తు చేశారు. కొత్తగా అంతర్జాతీయ స్థాయి పరీక్షా విధానాన్ని రాష్ట్ర విద్యాశాఖలో అమలు చేయాలని తమ ప్రభుత్వం భావిస్తున్నట్లు వెల్లడించారు. ప్రైవేటు పాఠశాలతో పోటీ పడేలా రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్చామన్నారు. 2022-23 సంవత్సరానికి గానూ పదో తరగతి, ఇంటర్ పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థిని, విద్యార్థులకు నగదు పురస్కారాలను అందించటం ఆనందంగా ఉందన్నారు. విద్యార్థులు ఇంతటి స్థాయికి రావడానికి తోడ్పాటును, ప్రోత్సాహాన్ని అందించిన ఆయా పాఠశాలల హెడ్ మాస్టర్‌లనూ ముఖ్యమంత్రి జగన్ సత్కరించారు. మొత్తం 20 మంది విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు.

గుడులుగా మారుతున్న గవర్నమెంట్ బడుల్లోంచి టెన్త్, ఇంటర్‌లో టాపర్లుగా నిలిచిన ప్రతి విద్యార్థిని, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. పేదరికం వల్ల చదువులకు దూరం కాకూడదని మన ప్రభుత్వం గట్టిగా నిర్ణయించింది కాబట్టే మీరు వెళ్లే గవర్నమెంట్ బడి..నేడు-నాడు ద్వారా రూపురేఖలన్నీ మారుతున్నాయి. ప్రైవేట్ బడులు..గవర్నమెంట్ బడులతో పోటీపడక తప్పదు అనే పరిస్థితికి తీసుకొచ్చారు. ఇక్కడితోనే ఆగిపోకుండా ప్రతి ఒక్కరూ డిగ్రీతో బయటికి రావాలి. రాబోయే రోజుల్లో మన గవర్నమెంట్ బడుల్లో ఐబీ సిలబస్ కూడా తీసుకువచ్చే ప్రణాళికలు సిద్దం చేస్తున్నాం.-వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

Last Updated :Jun 20, 2023, 2:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.