ETV Bharat / state

CID arrests govt employees: నలుగురు ప్రభుత్వ ఉద్యోగులు అరెస్టు.. ఖండించిన ఉద్యోగ సంఘాల నేతలు

author img

By

Published : May 31, 2023, 10:51 PM IST

Updated : Jun 1, 2023, 6:23 AM IST

వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అరెస్టుపై ఏపీ ఉద్యోగ సంఘం నేత సూర్యనారాయణ స్పందించారు. ప్రభుత్వం ఉద్యోగులపై ప్రభుత్వం కక్ష సాధింపు మానుకోవాలని సూర్యనారాయణ హితవు పలికారు. రెండేళ్ల క్రితం వార్తను పట్టుకొని ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఉద్యోగుల అరెస్టుపై సీఎస్‌ స్పందించాలని డిమాండ్ చేశాడు. ఉద్యోగులను ఎత్తుకుపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఉద్యోగులు కనిపించకపోవడంపై రేపు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని సూర్యనారాయణ వెల్లడించారు.

Etv Bharat
Etv Bharat

Employees Union Leader: విజయవాడలోని వాణిజ్య పన్నుల శాఖ ఒకటో డివిజన్​లోని నలుగురు ఉద్యోగులను సీఐడీ అరెస్టు చేసింది. ఈఎస్ఐకు చెందిన పన్ను వసూళ్లలో అవకతవకలకు పాల్పడ్డారన్న అభియోగాలపై కేసు నమోదు చేసిన అధికారులు ఆ మేరకు నలుగురు ఉద్యోగులు మెహర్, సంధ్య, సత్యనారాయణ, చలపతి రావులను అరెస్టు చేశారు. 200 కోట్ల రూపాయల మేర ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూకు గండికొట్టారన్న అభియోగాలపై సీఐడీ ఈ కేసు నమోదు చేసింది. వాణిజ్య పన్నుల శాఖ ఉన్నతాధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే ఈ నలుగురినీ ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఉద్యోగుల బదిలీల వ్యవహారంలో అదనపు కమిషనర్ కార్యాలయం వద్ద ఓ సంఘం ధర్నాకు దిగిన వ్యవహారంలోనూ ఈ నలుగురు ఉద్యోగులు ఉండటంతో వీరికీ గతంలో సంజాయిషీ నోటీసులు జారీ అయ్యాయి.

APJAC AMARAVATI: ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధనకు 43 రోజులుగా ఉద్యమిస్తున్నాం: బొప్పరాజు

ఏపీ వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల అరెస్టు వ్యవహారంపై ఉద్యోగుల సంఘం నేతలు సూర్యనారాయణ, ఆస్కార్ రావులు స్పందించారు. ప్రతీ నెలా 1వ తేదీనే జీతాలు ఇవ్వమని తాము గవర్నర్​ను కలిసినందుకు ప్రభుత్వం తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ఉద్యోగులపై కక్ష సాధింపు మానుకోవాలని హితవు పలికారు. రెండేళ్ల క్రితం ఓ పత్రికలో వచ్చిన వార్తను పట్టుకొని ఉద్యోగులను సస్పెండ్​ చేశారన్నారు. ఏపీ హైకోర్టు ఆ సస్పెన్షన్లను కొట్టివేసిందని గుర్తు చేసారు. అప్పట్లో తొమ్మిది మందిపై మొత్తం విచారణ చేయాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేెశాలు ఇంకా అమలు కాలేదని వెల్లడించారు.

అరెస్ట్ అయిన వారిలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఆఫీస్ బేరర్లలో ఒకరి ఇంట్లో వివాహం ఉంది, మరొకరికి ఆరోగ్యం సరిగా లేదని సూర్యనారాయణ పేర్కొన్నారు. అరెస్ట్ చేసిన వారు ఏ కేసులో వీరిని అరెస్ట్ చేశారో, ఎక్కడికి తీసుకొని వెళ్లారో కూడా కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేదని సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేసారు. సస్పెండ్​లు, అరెస్టులు చేస్తే ఉద్యోగులు ఎవరూ భయపడరన్నారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉద్యోగుల అరెస్ట్​పై నోరు మెదపాలని డిమాండ్ చేసారు. తప్పు చేసినవారిపై చర్యలు తీసుకుంటే తమకు అభ్యంతరం లేదన్నా నేతలు వారి నిజాయితీ వారే నిరూపించుకుంటారని స్పష్టం చేసారు. ఇంత అరాచకంగా ప్రభుత్వం ప్రవర్తించడం న్యాయమా అని ప్రశ్నించారు. ఈ కేసు ఏ ఏజన్సీ విచారణ చేస్తోందో కూడా తెలియదన్నారు. రాజకీయ కారణాల తో ఉద్యోగుల అరెస్టుపై సీఎస్ మౌనంగా ఉంటారా అని సూర్యనారాయణ నిలదీశారు. ప్రభుత్వం దొంగిలించిన తమ జీపీఎఫ్ డబ్బులు తిరిగి ఇచ్చే వరకు ఉద్యోగులుగా పోరాటం చేస్తూనే ఉంటారని స్పష్టం చేసారు. తమ ఉద్యోగులను ఎత్తుకుపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. రేపు ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తామని తెలిపారు. అరెస్టులు చేసేందుకు కులాలు చూస్తారా అని ధ్వజమెత్తారు. ఈ కేసులో పేర్లు ఉన్న ఉన్నతాధికారులపై ఇప్పటి వరకూ ఎందుకు చర్యలు లేవో చెప్పాలన్నారు.

మా సమస్యలపై గవర్నర్‌ను కలిసినందుకు ప్రభుత్వం మాపై కక్ష కట్టింది. ప్రభుత్వం ఉద్యోగుల పై ప్రభుత్వం కక్షసాధింపు మానుకోవాలి. రెండేళ్ల క్రితం వార్తను పట్టుకొని ఉద్యోగులను సస్పెండ్‌ చేస్తారా? అరెస్టులు చేస్తే ఉద్యోగులు భయపడరు. జీపీఎఫ్ డబ్బులు ఇచ్చేంత వరకు ఉద్యోగుల పోరాటం ఆగదు. ఉద్యోగులను ఎత్తుకుపోయిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. కనిపించకపోవడంపై రేపు హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తాం. -సూర్యనారాయణ, ఏపీ ఉద్యోగ సంఘం నేత

Last Updated :Jun 1, 2023, 6:23 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.