జగన్ తప్పుల్ని ప్రశ్నించినందుకు జైల్లోనే చంపాలని చూశారు: రఘురామ - Raghu Rama Raju Fire on CM Jagan

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 3:43 PM IST

thumbnail
జగన్ తప్పుల్ని ప్రశ్నించినందుకు జైల్లోనే చంపాలని చూశారు: రఘురామ (ETV Bharat)

Raghu Rama Krishna Raju Fire on CM Jagan: సీఎం జగన్ మోహన్​ రెడ్డి అరాచకాలను గుర్తుచేసుకున్నారు నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు. తాను ఎత్తిచూపిన తప్పుల్ని ప్రశ్నించినందుకు తనను జైల్లో చంపాలని చూశారని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు చెప్పారు. పుట్టిన రోజునాడు అరెస్ట్ చేసి తీసుకెళ్లి, పోలీస్‌ కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెల్లకాగితంపై వారు చెప్పినట్లుగా సంతకం పెట్టకపోతే చంపేస్తామని బెదిరించారని వెల్లడించారు. రాజమహేంద్రవరంలో అభిమానులు ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఆయన వైఎస్సార్సీపీ ప్రభుత్వం తనను ఎలా ఇబ్బందులకు గురిచేసిందో వివరించారు. జగన్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదని రఘురామ కృష్ణరాజు మండిపడ్డారు. 

"జగన్ తప్పుల్ని ప్రశ్నించినందుకు నాపై కక్షకట్టారు. పుట్టిన రోజునాడు అరెస్ట్ చేసి పోలీస్‌ కస్టడీలో చిత్రహింసలకు గురి చేశారు. జైల్లోనే నన్ను చంపాలని చూశారు. వారు చెప్పినట్లుగా సంతకం పెట్టకపోతే చంపేస్తామన్నారు. జగన్ లాంటి వ్యక్తిని ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు." - రఘురామకృష్ణరాజు, నరసాపురం ఎంపీ 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.