ETV Bharat / state

Vadde Sobhanadreeswara Rao: 'జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది'

author img

By

Published : Apr 15, 2023, 9:27 PM IST

Vadde Sobhanadreeswara Rao on YS Jagan: ప్రభుత్వ అవినీతి, అక్రమాలను చూపుతున్నందునే.. ఈనాడు అనుబంధ సంస్థ మార్గదర్శిపై.. జగన్‌ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. నిధులను దారి మళ్లిస్తూ.. బటన్‌లు నొక్కుతున్న ముఖ్యమంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు.

Vadde Sobhanadreeswara Rao
వడ్డే శోభనాద్రీశ్వరరావు

Former Minister Vadde Sobhanadreeswara Rao: రాష్ట్రంలో, కేంద్రంలో పరిస్థితులు చూస్తుంటే.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనిపిస్తోందని మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. ప్రజాస్వామ్యానికి కీలకమైన మీడియా.. వాస్తవాలను ప్రజలకు తెలిసేలా వార్తలు ప్రచురిస్తూ, ప్రజాస్వామ్యాన్ని కాపాడుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ అవినీతి, అక్రమాలను చూపుతున్నందునే.. ఈనాడు అనుబంధ సంస్థ మార్గదర్శిపై.. జగన్‌ సర్కారు కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందన్నారు.

ఒక్కరైనా ఫిర్యాదు చేశారా?: మార్గదర్శి సంస్థ వల్ల నష్టపోయామని ఒక్క చందాదారైనా ఫిర్యాదు చేశారా అని.. వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రశ్నించారు. ఫిర్యాదు లేకుండా సుమోటోగా తీసుకుని చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం దుర్మార్గమైన చర్య అన్నారు. దిల్లీ వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి మరీ.. ఫిర్యాదు చేసే దాకా ఆగాలా అని సీఐడీ అధికారులు మాట్లాడటం సరికాదన్నారు.

కేంద్రం నిదులు పక్కదారి: కేంద్రం విడుదల చేస్తున్న నిధులను కూడా.. రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టిస్తోందని మాజీ ఎంపీ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శించారు. నిధులను దారి మళ్లిస్తూ.. బటన్‌లు నొక్కుతున్న ముఖ్యమంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రశ్నించారు. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై సీఎం బొమ్మేంటని నిలదీశారు. హైకోర్ట్ ఎన్ని సార్లు మొట్టికాయలు వేసినా వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి బుద్ధి రాలేదని మండిపడ్డారు. ఎవరైనా రాజ్యాంగానికి లోబడి పని చేయాల్సిందే అని స్పష్టం చేసారు.

కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్న జగన్ ప్రభుత్వం

"ఈనాడు పత్రికలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు.. అందులోని మంచీ చెడులు, ఎక్కడైనా అవినీతి ఆస్కారం కలుగుతూ ఉన్నా.. వాటిని ఎత్తిచూపుతోంది. అందుకు గానూ కక్ష సాధింపుగా మార్గదర్శిపై కేసు పెట్టి, సోదాలు నిర్వహించి.. రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇన్ని సంవత్సరాలలో.. లక్షలాదిమంది డిపాజిటర్లలో.. ఒక్కరైనా సరే మాకు మార్గదర్శి నుంచి రావలసిన డబ్బు అందలేదని ఫిర్యాదు చేశారా? ఎవరూ చేయకపోయినా.. సుమోటోగా డిపాజిటర్ల ప్రయోజనాలను పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నాం అని చెప్తున్నారు. వారు వచ్చి ఫిర్యాదు చేసే దాగా ఆగాలా అని చెప్తున్నారు.

గ్రామ పంచాయతీలకు 14వ ఫైనాన్స్ కింద వచ్చిన నిధులను.. నువ్వు తీసుకొని బటన్ నొక్కుడుకు ఎలా మళ్లించావు జగన్మోహన్ రెడ్డి గారూ అని నేను ప్రశ్నిస్తున్నాను. మన రాష్ట్రంలో తాగడానికి నీరు లేక ఇబ్బందులు పడుతూ ఉంటే.. ఆ నిధులును బటన్ నొక్కుడుకు వాడేశారు. దీని మీద ఏం చర్యలు తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలి. ఇది చాలా దుర్మార్గం. అధికారం ఎవరికీ కూడా శాశ్వతం కాదు అని గుర్తించుకోవాలి. రైతుల పట్టాదారు పాసుపుస్తకాలపై జగన్మోహన్ రెడ్డి బొమ్మ వేయించుకున్నారు". - వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎంపీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.