ETV Bharat / state

సీఎం సభలకు వస్తారా? చస్తారా?-డ్వాక్రా మహిళలకు వైసీపీ నేతల హూకుం

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 2, 2023, 8:18 AM IST

Dwakra Women in CM Jagan Meeting: అదేంటన్న వారిని అరెస్టులు చేస్తూ, నిరసన తెలిపిన వారిని నిర్బంధిస్తూ, ప్రశ్నించిన వారిపై విషం చిమ్ముతూ, అడుగడుగునా నియంతను తలపిస్తున్న జగనన్న పాలనలో ఆడబిడ్డల్ని అరువు వస్తువులుగా పరిగణిస్తున్నారు. సభలు, సర్కారు సమావేశాలకు డ్వాక్రా మహిళలనూ, ప్రభుత్వ పథకాల లబ్ధిదారుల్ని ఒత్తిడి చేసి మరీ తరలిస్తున్నారు. 'పింఛన్లు తీసుకోవట్లేదా సభలకెందుకు రారంటూ ఒంటరి మహిళలనూ వేధిస్తున్నారు.

Dwakra_Women_in_CM_Jagan_Meeting
Dwakra_Women_in_CM_Jagan_Meeting

సీఎం సభలకు వస్తారా? చస్తారా?-డ్వాక్రా మహిళలకు వైసీపీ నేతల హూకుం

Dwakra Women in CM Jagan Meeting : ముఖ్యమంత్రి మొదలుకుని, వైసీపీ నాయకుల సభలు సమావేశాలకు డ్వాక్రా మహిళల్ని బలవంతంగా తరలిస్తున్న తీరు! గతంలో మాజీ మంత్రి వెల్లింపల్లి శ్రీనివాసరావు (Former Minister Vellampalli Srinivasa Rao) పర్యటనకు డ్వాక్రా మహిళల్ని తీసుకురావాలంటూ వైసీపీ నాయకులో, వారి ఒత్తిళ్లకు తలొగ్గిన అధికారులో హుకుం జారీ చేయడంపై పెల్లుబికిన ఆక్రోశం. వైసీపీ సభలు జరిగే ప్రతీచోటా ఇదే పరిస్థితి.

People Running Away from CM Jagan Public Meeting : డ్వాక్రా సంఘాల మహిళలను (Dwakra Women) అధికార పార్టీ రాజకీయ సభలకు తరలివచ్చే ముడిసరకుగా మార్చేసింది. ఊరూ, మండలం, జిల్లా, రాష్ట్రం ఎక్కడ సభలున్నా ఆటోలలో, వ్యాన్లలో కుక్కేసి తెస్తున్నారు. రానని మొండికేశారో ఇక అంతే సంక్షేమ పథకాలు కోతేస్తామని బెదిస్తున్నారు. పోనీ ఎగ్గొడదామా అంటే ఎవరు వచ్చారో, ఎవరు రాలేదో నోట్ చేసుకుంటాం? లేదంటే సభ వద్ద సెల్ఫీ తీసుకుని ఆ ఫొటోను వాట్సాప్‌ ద్వారా పంపాలనే వరకూ పైత్యం వెళ్లింది. అలాగైతేనే మెప్మా రీసోర్స్‌పర్సనలు, వాలంటీర్లు రికార్డు చేస్తారు. ఇలాంటి బెదిరింపులకు భయపడి కొందరు డ్వాక్రామహిళలు.. సభకురాగానే సెల్ఫీ తీసుకుని ఫోటోను పంపి.. జారుకుంటున్నారు. అందుకే వైసీపీ చేస్తున్న సామాజిక సాధికార సభల్లో కాసేపటికే కుర్చీలన్నీ ఖాళీ అవుతున్నాయి.

Warning to women on CM Sabha : 'సీఎం జగన్ సభ.. వెళ్లకుంటే ఉద్యోగాలు ఊడిపోతాయ్..' డ్వాక్రా ఆర్పీ ఆడియో లీక్

Empty Chairs in CM Jagan Meeting : డ్వాక్రా మహిళలు లేనిదే వైసీపీ ఏ కార్యక్రమం నడపదు : సామాజిక న్యాయభేరి, జగనన్న ఆరోగ్య సురక్ష, ఏపీకి జగనే ఎందుకు కావాలి, సామాజిక సాధికార యాత్ర, మూడు రాజధానులకు మద్దతుగా వైసీపీ ఆధ్వర్యంలో చేపట్టిన గర్జన సభలు. ఇలా ఎన్నో రాజకీయ ప్రచార కార్యక్రమాలకు మొదటిగా తరలిస్తోంది డ్వాక్రా మహిళలనే. గడప గడపకు మన ప్రభుత్వం పేరుతో ఎమ్మెల్యేలు ఇంటింటికీ తిరుగుతున్నపుడూ వారి వెనుకా డ్వాక్రా సంఘాల మహిళలు ఉండాల్సిందేని హుకుం జారీ చేస్తున్నారు. అడబిడ్డల్ని రోడ్లపైకి తెచ్చి వారి స్వాభిమానాన్ని దెబ్బతీస్తున్నారు.

సభలో ఉండలేక పోలేక సతమతం : ముఖ్యమంత్రి సభలుంటే చాలు పొద్దుపొద్దున్నే డ్వాక్రా మహిళలను, పింఛన్‌ లబ్ధిదారులను సభాస్థలికి తరలిస్తున్నారు. సభ పూర్తయ్యేదాకా బయటకి వెళ్లకుండా పోలీసులతో మూడంచెల బారికేడ్లు పెట్ట కట్టడి చేస్తున్నారు. జగన్‌ వచ్చేదాకా ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవాల్సిందే. కొందరైతే గేట్లు తోసుకునో, గోలు దూకో బటపడుతున్నారు. జగన్‌ ప్రాపకం కోసం మహిళల్ని అంతలా హింసించాలా అనే ప్రశ్న తలెత్తుతోంది.

ప్రభుత్వ కార్యక్రమమైతే చాలు.. డ్వాక్రా మహిళలకు కష్టాలే

మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేసి సభలకు తరలింపు : సభలకు రాకుంటే రుణమాఫీ డబ్బు ఇవ్వం, కొత్త రుణాలూ రాకుండా చేస్తాం, అంటూ ఆయా డ్వాక్రా సంఘాల మహిళలను బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నారు. గతేడాది విశాఖ పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీని ప్రసన్నం చేసుకునేందుకు వైసీపీ పెద్ద ఎత్తున జనసమీకరణ చేసింది. ప్రధాని సభకు రాకపోతే ఇళ్లకు నీటి సరఫరా నిలిపివేస్తామని బెదిరించింది. భీమిలి మండల పరిధిలో అన్నంత పనిచేసి మహిళలను వైసీపీ నాయకులు సభకు తరలించారు. ఏ ప్రాంతం నుంచి ఎంతమంది మహిళలను తరలించాలనే దానిపై VAOలు, ఆర్పీలకు లక్ష్యాలనూ నిర్దేశిస్తున్నారు.

జగన్ నమ్మక ద్రోహం : ఇంత చేసినా స్వయంసహాయక సంఘాలకు జగన్‌ ప్రత్యేకంచి చేసిన మేలేమీలేదు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఏడాదికి 18,750 చొప్పున చేయూత కింద సాయం అందిస్తామని చెప్పి, దానికి పలు నిబంధనలు పెట్టి లబ్ధిదారుల సంఖ్యని ఏటికేడూ తగ్గిస్తున్నారు. గత ప్రభుత్వంలో పశుమిత్రలుగా పని చేసిన దాదాపు 3వేల మంది మహిళలను తొలగించారు. 2వేల మంది బీమా మిత్రల నోట్లో మట్టికొట్టారు. సీఎంగా కొనసాగినంత కాలం కల్యాణమిత్రలుగా మీరే ఉంటారంటూ ఊరడంచిన జగన్‌ దాదాపు 2 వేల 500 మంది కల్యాణమిత్రలను నమ్మించి తొలగించారు.

వైసీపీ సభలంటే హడలిపోతున్న ప్రజలు.. ఖాళీ కుర్చీలకు ప్రసంగాలు ఇస్తూ సంబరపడుతున్న నేతలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.