కేసులకు భయపడి, నీటిపారుదల రంగాన్ని గాలికొదిలేశారు.. అఖిలపక్షనేతల మండిపాటు

author img

By

Published : Mar 5, 2023, 4:23 PM IST

CPI held a round table meeting

neglected irrigation projects in AP: విజయవాడలో సీపీఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులు, బడ్జెట్ కేటాయింపులపై సమావేశంలో వివిధ పార్టీల నేతలు స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలు, నిర్వహణ ప్రమాదంలో పడిందని నాయకులు ఆరోపించారు. రాబోయే బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణకు 15% నిధులు కేటాయించాలని తీర్మానం చేశారు.

CPI Round Table Meeting Held at Vijayawada: రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మాణం, నిర్వహణ ప్రమాదంలో పడ్డాయని అఖిలపక్ష పార్టీల నాయకులు అన్నారు. విజయవాడలో రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టుల స్థితిగతులు బడ్జెట్ కేటాయింపులు అంశంపై సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి అఖిలపక్ష నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో రాబోయే బడ్జెట్లో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం నిర్వహణకు 15% నిధులు కేటాయించాలని తీర్మానం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా పోలవరం ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా రాష్ట్రంలోని అన్ని సాగునీటి ప్రాజెక్టులు నిర్వహణ లేక ప్రమాదకరస్థాయిలో ఉన్నాయని ఇటీవల ప్రాజెక్టులను సందర్శించిన సీపీఐ నాయకులు అన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రయోజనాలను కేంద్ర ప్రభుత్వం వద్ద తాకట్టు పెట్టారని తెటీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని మండిపడ్డారు. ఏడాదిలో పోలవరాన్ని పూర్తి చేస్తామని చెప్పిన మంత్రి ఏమైపోయాడో తెలియదని ఎద్దేవా చేశారు. ఇప్పుడు ఉన్న ఇరిగేషన్ మంత్రికి ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదన్నారు. రాబోయే బడ్జెట్ లో ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

'రాష్ట్రంలో ఇరిగేషన్ ప్రాజెక్టుకు నత్తనడకన నడుస్తున్నాయి. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరానికి నిధులు ఇవ్వకుండా.. కర్ణాటకలోజరిగే ఎన్నిలను దృష్టిలో పెట్టుకొని రూ.5వేయిల కోట్లు కేంద్రం నిధులు కేటాయించినా ప్రభుత్వం స్పందించడం లేదు. '- కె. రామకృష్ణ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

జగన్ ప్రభుత్వం సాగునీటి ప్రజెక్టులకోసం కేవలం 5శాతం నిధులు కేటాయిస్తుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు తులసి రెడ్డి వెల్లడించారు. కేటాయించిన నిధులను సైతం ఖర్చు చేయడం లేదని ఆరోపించారు. కొన్ని ప్రజెక్టులకు నిధులు కేటాయించక పోవడంతో ఆ ప్రజెక్టులు వర్షాలకు కొట్టుకుపోయినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం ఇరిగేషన్ ప్రాజెక్టుల కోసం 15శాతం నిధులు కేటాయించాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు. కర్ణాటక నిర్మిస్తున్న అప్పర్ భద్ర నిలుపుదల చేయడానికి రాష్టప్రభుత్వం సుప్రీం కోర్టులో కేసులు వెయ్యాలని తులసి రెడ్డి డిమాండ్ చేశారు.

'ఈ రోజు సీపీఐ నేతలు అప్పర్ తుంగ భద్ర డ్యాంతో పాటుగా వివిధ ప్రాజెక్టులు తిరిగారు. ఆయా ప్రాజెక్టుల స్థితిగతులపై వివిధ పార్టీ నేతలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. కేంద్రం అప్పర్​ తుంగ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం 5వేయిల కోట్లు ఇస్తే మంత్రి స్పందించడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రుల ప్రజెక్ట్​లపై అవగాహణ లేదు. మంత్రిని పోలవరంపై ప్రశ్నిస్తే తన పక్కన ఉన్నవారిని అడిగి తెలుసుకుంటాను అంటున్నారు. మెుదట ఇరిగేషన్ మంత్రిగా చేసిన అతను బుల్లెట్ దిగిందా లేదా అన్నారు. ఆ మాజీ మంత్రి ఇప్పుడు ఎక్కడ ఉన్నారో తెలియదు. రాష్ట్ర విభజన ద్వారా రాష్ట్రానికి వచ్చే లక్ష కోట్లను అడకుండా... బాబాయి హత్య కేసులో కేంద్రానికి బయపడి పోతున్నారు'-. దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి

నీటిపారుదల ప్రాజెక్టుల కేటాయింపులపై రౌండ్‌టేబుల్‌ సమావేశం

ఇవీ చదంవడి:

ప్రాజెక్టు పూర్తి చేయడంలో తొందర లేదు.. నాణ్యతే ముఖ్యం: అంబటి
స్పీడ్​గా వెళ్తున్న ఆటో.. గాల్లోకి ఎగిరిన నోట్లు.. కట్​చేస్తే..!

'అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని.. 'శ్రామిక మహిళా పోరాట' దినంగా జరుపుకోవాలి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.