స్పీడ్​గా వెళ్తున్న ఆటో.. గాల్లోకి ఎగిరిన నోట్లు.. కట్​చేస్తే..!

author img

By

Published : Mar 5, 2023, 9:37 AM IST

notes

NOTES DROPPED FROM AUTO: డబ్బు.. లోకంలో బంధాలను సైతం నడిపేది. అది ఉంటే అన్ని ఉన్నట్టే అని చాలా మంది అనుకుంటారు. దాని కోసం చాలా మంది అడ్డదారులు కూడా తొక్కుతారు. మరి అలాంటి డబ్బు గాల్లో ఎగిరితే.. ఇంకేముంది వాటిని అందుకోవాలని చాలా మంది ఆశపడుతుంటారు. సరిగ్గా ఓ టోల్​గేట్​ వద్ద స్పీడ్​గా వెళ్తున్న ఆటోలో నుంచి డబ్బులు ఎగిరిపడ్డాయి. ఆ తర్వాత ఏం జరిగింది?

NOTES DROPPED FROM AUTO: ధనం మూలం ఇదం జగత్.. అంటే డబ్బుతో ఏదైనా, దేన్నైనా సొంతం చేసుకోవచ్చు అనుకునేవాళ్లు ఈ సమాజంలో చాలా మందే ఉన్నారు. వాళ్లని మనం చూస్తూనే ఉన్నాం. అంతగా ధనం ప్రపంచాన్ని శాసిస్తుంది. అందుకే పెద్ద వాళ్లు ధనం మూలం ఇదం జగత్ అంటారు. అంటే డబ్బుతోనే ఈ ప్రపంచ నడుస్తోంది అని అర్థం.

మరి అలాంటి డబ్బు అంటే ఇష్టం లేని వారు ఎవరూ ఉండరు. ప్రతి మనిషి జీవితంలో డబ్బుకు ప్రాధాన్యం ఉంటుంది. నేటీ సమాజంలో బంధుత్వాల కన్నా ధనానికే ఎక్కువ విలువ ఇస్తున్నారు. వస్తువు నుంచి మనుషుల వరకూ దేనినైనా కొనుగోలు చేయాలంటే కావాల్సింది డబ్బు. మరి అలాంటి డబ్బు గాలిలో ఎగురుకుంటు వస్తే.. ఎవరైనా దాని కోసం ఆశపడతారు. తాజాగా ఇలాంటి ఘటనే శ్రీకాకుళం జిల్లాలో జరిగింది.

జిల్లాలోని నరసన్నపేట మండలం మడపం టోల్​గేట్​ వద్ద ఓ ఆటోలో నుంచి 500 రూపాయల నోట్లు గాలిలోకి ఎగిరాయి. శ్రీకాకుళం నుంచి నరసన్నపేట వైపు వెళ్తున్న ఓ ఆటో టోల్​గేట్​ వద్దకు ఫుల్​స్పీడ్​లో వచ్చింది. ఈ క్రమంలోనే ఆటోలో ఉన్న 500 రూపాయల నోట్లు గాలిలోకి ఎగిరాయి. గమనించిన టోల్​ గేట్ సిబ్బంది జాతీయ రహదారిపై పడి ఉన్న 500 రూపాయల నోట్లను సేకరించారు. అయితే ఆటో కంటే ముందు ఒక ద్విచక్ర వాహనం ప్రయాణించినట్టు సిబ్బంది గుర్తించారు.

సీసీ కెమెరాల్లో ఆటో వెళ్లడాన్ని గుర్తించారు కానీ ఆటో నెంబరు, ఇతర వివరాలను పోల్చలేకపోయారు. టోల్​గే ట్ సిబ్బంది నరసన్నపేట పోలీసులకు సమాచారం అందించారు. సిబ్బంది సేకరించిన 88 వేల రూపాయలను పోలీసులకు శనివారం రాత్రి అందజేశారు. ఈ సొమ్ము ఎవరికీ చెందింది అన్నది తెలియరాలేదు.

సీసీ టీవీ దృశ్యాలు పరిశీలించిన పోలీసులు ఆటో వివరాలు సేకరిస్తున్నారు. సరైన పత్రాలు, ఆధారాలు చూపించి నగదును తీసుకెళ్లవచ్చని ఎస్సై సింహాచలం తెలిపారు. అయితే ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్న నేపథ్యంలో ఇవి ఆటోలో నోట్ల తరలింపుపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ డబ్బును ఎన్నికల కోసం తీసుకువెళ్తున్నారా లేక వేరే ఇతర కారణాలు ఉన్నాయా అనేది పోలీసుల దర్యాప్తులో తెలిసే అవకాశం ఉంది.

"ఆటోలో నుంచి నగదు కింద పడితే టోల్​గేట్​ సిబ్బంది గమనించి మాకు అందించారు. ఆ డబ్బులు సుమారు 88వేల రూపాయలు ఉన్నాయి. ఈ డబ్బులు ఆటోలో నుంచి పడినట్లు సీసీ టీవీల్లో గుర్తించాము కానీ ఆటోకు సంబంధించి పూర్తి వివరాలు తెలియలేదు. ఎవరైనా సరైనా పత్రాలు, ఆధారాలు చూపిస్తే వారికి అందిస్తాము"-సింహాచలం, నర్సన్నపేట ఎస్సై

స్పీడ్​గా వెళ్తున్న ఆటో.. గాల్లోకి ఎగిరిన నోట్లు.. కట్​చేస్తే..!

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.