ETV Bharat / state

వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష - డిసెంబర్‌ 18 నుంచి కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Dec 4, 2023, 10:41 PM IST

cm_jagan_review_on_medical_dept
cm_jagan_review_on_medical_dept

CM Jagan Review on Medical,Health Department: వైద్య, ఆరోగ్యశాఖపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండోదశ కార్యక్రమాలు చేపట్టనున్నారు. డిసెంబర్‌ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan Review on Medical,Health Department: వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమీక్షలో భాగంగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు, దిశ యాప్‌, జగనన్న ఆరోగ్య సురక్ష వంటి అంశాలపై అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం డిసెంబర్‌ 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పేదలకు మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించే విషయంలో అధికారులు ఎక్కడా తగ్గొద్దని సీఎం జగన్ సూచించారు

CM Jagan Comments: ''ప్రతి ఒక్కరి ఫోన్లో ఆరోగ్య శ్రీ, దిశ యాప్‌లు ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో గుర్తించిన రోగులకు వైద్య చికిత్సలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికి సకాలంలో మందులు అందజేయాలి. ఆస్పత్రుల్లో ఎక్కడా ఖాళీలు ఉండకూడదు. సిబ్బంది లేదనే మాట వినపడకూడదు. ఆరోగ్య శ్రీ మీద విస్తృతంగా ప్రచారం చేయండి. ఆరోగ్య శ్రీ సేవలు ఎలా వినియోగించుకోవాలో ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించండి. ఏ పేదవాడు వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు. వైద్య ఖర్చుల కోసం ప్రజలు అప్పులు పాలుకాకూడదు. ఉచితంగా వైద్యం ఎలా పొందాలో వారికి తెలియజేయండి. డిసెంబర్‌ 18 నుంచి కొత్త ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ ప్రారంభించండి'' అని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

ఫిబ్రవరి నాటికి మరో 5 లక్షల ఇళ్లు - గృహనిర్మాణ శాఖపై సీఎం జగన్‌ సమీక్ష

Officials Comments on Arogyashri: 1 కోటి 42 లక్షల 34 వేల 464 కొత్త ఆరోగ్య శ్రీ కార్డులు ప్రింట్‌ అవుతున్నాయని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. ఆరోగ్య శ్రీకి సంబంధించిన పూర్తి సమాచారంతో కూడిన బ్రోచర్లను సిద్ధం చేశామని వెల్లడించారు. కంటి చికిత్సలతోపాటు ఇతర వైద్య చికిత్సలకు సంబంధించి సుమారు 86 వేల 690 మందిని అత్యవసర చికిత్సలకు పంపించామన్నారు. ప్రతి కుటుంబంలో దిశ యాప్ డౌన్లోడ్‌ అయ్యేలా చూస్తున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు.

CM Jagan Review Meeting on Education: ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్​కు ప్రణాళికలు సిద్ధం చేయాలి: సీఎం జగన్​

జనవరి 1 నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం రెండోదశ కార్యక్రమాలు చేపట్టండి. రూరల్‌ ప్రాంతాల్లో ప్రతి మండలంలో ప్రతివారం ఆరోగ్య సురక్ష క్యాంపు నిర్వహించి, క్యాంపుల వద్దే అవసరమైన వైద్య పరీక్షలు చేయండి. చైనాలో విస్తరిస్తున్న హెచ్‌-9, ఎన్‌-2 వైరస్‌ దృష్ట్యా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. బోధనాసుపత్రులు, పీడియాట్రిక్‌ హెచ్‌ఓడీ విభాగాలు, పల్మనాలజీ, జనరల్‌ మెడిసన్‌ విభాగాలకు సంబంధించిన సదుపాయాలపై దృష్టి సారించండి. ఆస్పత్రుల్లో ఎక్కడా కూడా ఖాళీలు లేకుండా చూడండి.-వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ముఖ్యమంత్రి

CM Jagan Suggests AI: టీచర్ల కొరతను ఏఐతో అధిగమించండి.. పాఠశాల విద్యపై సమీక్షలో సీఎం సూచన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.