ETV Bharat / state

Bopparaju Comments: ఉద్యోగుల ఉద్యమం వృథా కాలేదు: బొప్పరాజు వెంకటేశ్వర్లు

author img

By

Published : May 24, 2023, 9:10 PM IST

RTC EU meeting in Vijayawada
ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్

RTC EU meeting in Vijayawada: విజయవాడలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 27వ రాష్ట్ర మహా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఆర్టీసీ ఈయూ నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఉద్యోగులు ఉద్యమం వృథా పోలేదని వెల్లడించారు. కారుణ్య నియామకాల అంశంలో ఉద్యోగుల ఉద్యమం ఫలితంగా కారుణ్య నియామకాలు చేపడుతున్నారని వెల్లడించారు.

Bopparaju attended RTC EU meeting in Vijayawada: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చే వరకు ఉద్యమం విరమించే ప్రసక్తే లేదని ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. ఉద్యోగుల న్యాయ పోరాటం వల్లే పలు సమస్యలు పరిష్కారమయ్యాయని బొప్పరాజు వెల్లడించారు. మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం కొనసాగిస్తున్నట్లు ఆయన తెలిపారు.

విజయవాడలో ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ 27వ రాష్ట్ర మహాసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఇతర ఆర్టీసీ ఈయూ నేతలు, ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బొప్పరాజు.. ఏపీ జేఏసీ అమరావతిలో ఆర్టీసీ ఈయూ కీలకపాత్ర పోషిస్తుందన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమం చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసి ఉద్యోగులు చనిపోతే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదని, ఉద్యమం ఫలితంగా కారుణ్య నియామకాలు చేపట్టారన్నారు. ఉద్యోగుల ఉద్యమం వృథా పోలేదని వెల్లడించారు. ఇదే స్పూర్తి తో మనం ముందుకు సాగాలన్నారు. ఎపీపీటీడీ, ఏపీ జేఏసీ అమరావతి కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు.

ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడారు. అభివృద్ధిలో ఉద్యోగులందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రయాణికులు లేనిదే మనము లేమని ఆయన వెల్లడించారు. ఆర్టీసీఉద్యోగులు ఎంత కష్టపడినా ప్రయాణికులు లేకుంటే ప్రయోజనం లేదన్నారు. ప్రయాణికులకు మెరుగైన సేవలు అందిస్తేనే మనకు ఆదరణ ఉంటుందన్నారు. ఉద్యోగుల మనుగడ కోసం అందరూ మన సంస్థ కోసం పని చేయాలన్నారు. ఆర్టీసీ ఆదాయం పెరిగితేనే మనకు అన్ని‌విధాలా మంచి జరుగుతుందన్నారు. సంస్థలో వ్యయం తగ్గిస్తేనే ఆర్టీసీకి ఉన్న అప్పు తీర్చవచ్చన్నారు. ఆర్టీసి ఆస్తులు లీజుకు మాత్రమే ఇస్తున్నామని, ఎవరికీ కట్టబెట్టడం లేదన్నారు. దీని‌వల్ల మనకి ఆదాయం వస్తుందన్నారు. ఎదురు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఉత్తమ సేవల కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నెంబర్ 149 అమల్లోకి తెచ్చామని తెలిపారు. ప్రజలు ఈ‌ నెంబర్ కి ఫోన్ చేసి అభిప్రాయాలు, ‌ఫిర్యాదులు‌ చెప్పవచ్చని ద్వారకా తిరుమలరావు వెల్లడించారు.

'ఏపీ జేఏసీ అమరావతిలో ఆర్టీసీ ఈయూ కీలకపాత్ర పోషిస్తుంది. ఆర్టీసీ ఉద్యోగులు చనిపోతే పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వలేదు.ఉద్యోగుల ఉద్యమం ఫలితంగా కారుణ్య నియామకాలు చేపట్టారు. ఇకపై సైతం ఎపీపీటీడీ, ఏపీ జేఏసీ అమరావతి కలిసి మిగిలిన సమస్యలను పరిష్కరించేందుకు పోరాటం చేస్తాం'-. బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి నేత

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.