Vidya Deevena Funds Released: "జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలన్నా.. తలరాతలు మారాలన్నా.. విద్య ఒక్కటే మార్గం"
Published: May 24, 2023, 4:28 PM

CM Jagan on Vidya Deevena: నిరుపేదలు సామాజికంగా ఎదగాలన్నా.. వివక్ష పోవాలన్నా.. వారికి చదువే గొప్ప అస్త్రమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరులో విద్యా దీవెన పథకం నిధుల విడుదల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. 9 లక్షల 95 వేల మంది పిల్లల తల్లుల ఖాతాల్లో 703 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ చేశారు. విద్యా దీవెన పథకం ద్వారా ఇప్పటి వరకు 10 వేల 636 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సీఎం జగన్ చెప్పారు. విద్యతోనే మార్పు సాధ్యమని నమ్మిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం.. నాలుగు సంవత్సరాలుగా ఈ పథకానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్లాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. తరాల తలరాతలు మారాలంటే విద్య ఒక్కటే మార్గం అని సీఎం అన్నారు. ప్రతి పేద కుటుంబం నుంచి డాక్టర్, కలెక్టర్ రావాలని విద్యార్థులకు సీఎం జగన్ పిలుపునిచ్చారు.