ETV Bharat / state

'ఉద్యోగుల ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానంలో ఎవరికీ మినహాయింపు లేదు'

author img

By

Published : Mar 2, 2023, 4:25 PM IST

Updated : Mar 2, 2023, 4:44 PM IST

face-recognition
face recognition

Face Recognition Attendence no Exemption: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరి 1వ తేదీ నుంచి ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగులందరికీ ముఖ ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) హాజరును తప్పనిసరి చేస్తూ జీవోను జారీ చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానం వల్ల అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని.. ఉద్యోగుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలియజేస్తూ పలు శాఖల ఉద్యోగులు మినహాయింపు ఇవ్వాలంటూ ఉన్నతాధికారులకు వినతిపత్రాలను అందజేశారు. ఈ క్రమంలో ఫేస్ రికగ్నిషన్ హాజరు విధానంలో ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఆర్. ముత్యాల రాజు స్పష్టం చేశారు.

Face Recognition Attendence no Exemption: రాష్ట్రవ్యాప్తంగా ఆయా ప్రభుత్వ కార్యాలయాల్లో పని చేస్తున్న ఉద్యోగుల హాజరుకు సంబంధించి.. సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఆర్. ముత్యాల రాజు కీలక విషయాలను వెల్లడించారు. గత నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానంలో ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదని తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితర ప్రజాప్రతినిధుల వద్ద పని చేస్తున్న ఓఎస్డీలు, పీఎస్‌లు, అదనపు పీఎస్‌లు, పీఏలకు ముఖ గుర్తింపు ఆధారిత హాజరు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి మినహాయింపు ఇవ్వలేదని ఆర్. ముత్యాల రాజు స్పష్టం చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఉద్యోగుల ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానానికి సంబంధించి ఫిబ్రవరి 17వ తేదీన జారీ చేసిన మెమోలో స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన వెల్లడించారు. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఆయా ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ విధిగా ఈ ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని తప్పక పాటించాలని.. ఎవరికీ ఎటువంటి మినహాయింపు లేదని.. సాధారణ పరిపాలన శాఖ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు ఆయన వివరించారు.

అనంతరం ముఖ గుర్తింపు ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) యాప్‌లో టూర్/ఆన్ డ్యూటీ వెసులుబాటు కల్పించినట్లు ఆయన తెలిపారు. ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, ఉద్యోగులందరూ విధిగా ముఖ గుర్తింపు ఆధారిత హాజరు విధానాన్ని ఖచ్చితంగా పాటించాల్సిందేనని, ఈ విషయంలో ఉద్యోగులందరూ ప్రభుత్వ నియమాలను పాటించాల్సిందేనని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఆర్.ముత్యాల రాజు వెల్లడించారు.

2023 జనవరి 1 నుంచి ముఖ గుర్తింపు ఆధారిత హాజరు అమలు: ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ గుర్తింపు ఆధారిత హాజరు ఖచ్చితంగా వంద శాతం అమలయ్యేలా చర్యలు చేపట్టాలని తెలియజేస్తూ.. ఆయా శాఖల కార్యదర్శులకు, విభాగాధిపతులకు, జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. ఆ ఉత్తర్వుల్లో రాష్ట్ర సచివాలయం, విభాగాధిపతులు, జిల్లా కలెక్టర్ల కార్యాలయాల్లో జనవరి 1వ తేదీ నుంచి, మిగతా ప్రభుత్వ కార్యాలయాల్లో జనవరి 16వ తేదీ నుంచి ముఖ గుర్తింపు ఆధారిత హాజరును ప్రవేశపెడుతూ.. సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముత్యాల రాజు గత 6వ తేదీన సర్క్యులర్‌‌ను విడుదల చేశారు.

ప్రభుత్వ కార్యాలయల్లో విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులంతా.. ఏపీఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌ను ఖచ్చితంగా డౌన్‌లోడ్‌ చేసుకుని ఎన్‌రోల్‌ కావాలని, యాప్‌ ద్వారానే హాజరు నమోదు చేయాలని స్పష్టం చేసింది. కానీ.. ఉత్తర్వుల్లో పేర్కొన్న విధంగా.. ఆశించిన స్థాయిలో ఆ ప్రక్రియ అమలు జరగలేదు. దీంతో ఆయా శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉద్యోగులందరూ ఎన్‌రోల్‌ చేసుకునేలా చూడాలని మరోసారి సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఆర్. ముత్యాల రాజు ఉత్తర్వులు జారీ చేశారు. విడుదల చేసిన ఉత్తర్వులలో హాజరు నమోదు ప్రక్రియ ఎక్కడైనా సక్రమంగా జరగకపోతే.. సంబంధిత కార్యాలయాల అధిపతులు, నోడల్‌ అధికారుల్నే బాధ్యుల్ని చేస్తామని పేర్కొన్నారు.

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల హాజర్ విషయంలో ప్రవేశపెట్టిన ముఖ గుర్తింపు ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, కొంతమంది ఉద్యోగుల వద్ద స్మార్ట్ ఫోన్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఉన్నతాధికారులకు వినతి పత్రాలను అందజేశారు. ముఖ గుర్తింపు ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానంలో మినహాయింపులు ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలో సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి ఆర్. ముత్యాల రాజు స్పందిస్తూ.. ముఖ గుర్తింపు ఆధారిత (ఫేస్ రికగ్నిషన్) హాజరు విధానంలో రాష్ట్ర ప్రభుత్వం ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదని స్పష్టం చేశారు.

ఇవీ చదవండి

Last Updated :Mar 2, 2023, 4:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.