ETV Bharat / state

సీఎం జగన్ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ...

author img

By

Published : Feb 8, 2023, 8:34 AM IST

Updated : Feb 8, 2023, 11:35 AM IST

Cabinet meeting today: సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో మోడల్ స్కూళ్లు, విద్యా సొసైటీ ల ఉద్యోగులకు విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలియచేసే అవకాశం ఉంది.

Etv Bharat
Etv Bharat

Cabinet meeting: సచివాలయంలో సీఎం జగన్ అధ్యక్షతన రాష్ట్ర క్యాబినెట్ సమావేశం ప్రారంభమైంది. సచివాలయం మొదటి బ్లాక్​లో మంత్రివర్గం భేటీ కొనసాగుతోంది. మోడల్ స్కూళ్లు, విద్యా సొసైటీ ల ఉద్యోగులకు విరమణ వయసు 62 ఏళ్లకు పెంపు ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలియచేసే అవకాశం ఉంది. అలాగే జిందాల్ స్టీల్ కు రామాయపట్నం పోర్టులో క్యాఫ్టివ్ బెర్త్ కేటాయింపు ప్రతిపాదనపై నా కేబినెట్ ఆమోదముద్ర వేయనున్నట్టు తెలుస్తోంది. ఇక సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి లో (ఎస్ఐపిబి) లో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలియజేసే అవకాశం ఉంది. వివిధ ప్రభుత్వ శాఖలు క్యాబినెట్​లో ప్రతిపాదన చేసే అంశాలను పీపీటి ద్వారా సమర్పించాలని సీఎస్ కార్యాలయం సూచించింది.

ఇవీ చదవండి:

Last Updated :Feb 8, 2023, 11:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.