ETV Bharat / state

కూల్​డ్రింక్ చోరీ చేశాడని.. కారం చల్లి చిత్రహింసలు పెట్టిన షాప్ ఓనర్

author img

By

Published : Dec 20, 2022, 11:33 AM IST

Stealing Cool Drink: హైదరాబాద్​లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. కూల్​ డ్రింక్​ దొంగతనం చేశాడనే కారణంతో.. దుకాణ యాజమాని తొమ్మిదేళ్ల బాలుడి బట్టలూడదీసి కాళ్లు చేతులు కట్టేసి కొట్టాడు. కారం చల్లుతూ చిత్రహింసలకు గురి చేశాడు.

Stealing Cool Drink
కూల్​డ్రింక్ చోరీ

Shop Owner Beats a Boy for Stealing Cool Drink: హైదరాబాద్ నాంపల్లిలోని కిరాణా షాప్​లో కూల్​డ్రింక్ బాటిల్ దొంగతనం చేశాడని 9 ఏళ్ల బాలుడిని చితక్కొట్టాడు ఆ షాప్ యజమాని కృష్ణ. ముందు తన నివాసానికి తీసుకుని వెళ్లి, బట్టలూడదీసి కాళ్లు చేతులు కట్టేసి కొట్టుకుంటూ వీడియోలను చిత్రీకరించాడు. కారం చల్లి దారుణంగా కొట్టాడు. అంతటితో ఆగకుండా ఆ వీడియోలను తెలిసిన వారికి పంపడంతో ఒకరి దగ్గరి నుంచి మరొకరి దగ్గరి ఇలా చివరికి బాలుడి తల్లిదండ్రులకు చేరాయి. దీంతో వారు హబీబ్​నగర్ పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆ వ్యక్తిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.