గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాలి : గవర్నర్

author img

By

Published : Jan 20, 2023, 9:07 PM IST

Updated : Jan 20, 2023, 9:48 PM IST

ap governor

Governor Tour: కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సడక్ నిధులను వెచ్చించి రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాలను అభివృద్ధి చేయాలని గవర్నర్ బిశ్వభూషణ్​ హరిచందన్ సూచించారు. నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామ గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్ పాల్గొని వారితో ముచ్చటించారు.

Governor interact with Tribals: గిరిజనులు, గిరిజన ప్రాంతాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. అవకాశాలను గిరిజన యువత సద్వినియోగం చేసుకుని దేశ సేవకు, జాతి అభ్యున్నతికి పాటు పడాలన్నారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి సడక్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రాంతాల్లో వెచ్చించి అభివృద్ధి చేయాలని సూచించారు. ప్రత్యేక సాంప్రదాయ జీవన శైలి కలిగి ఉన్న గిరిజనుల గౌరవించాలని ఆయన తెలిపారు.

నంద్యాల జిల్లా పాణ్యం మండలం నెరవాడ గ్రామ గిరిజన గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేసిన గిరిజనులతో ముఖాముఖి కార్యక్రమంలో గవర్నర్​ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలు గవర్నర్​తో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు రాజన్న దొర, అంజాద్ బాష ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా గిరిజన మహిళలకు రూ.4.30 కోట్ల విలువైన చెక్కును గవర్నర్ అందజేశారు.

ఉన్నత చదువుతోనే ఉన్నత శిఖరాలకు : చెంచులు ఉన్నత చదువుతోనే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ అన్నారు. నెరవాడ మెట్ట వద్ద గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో గవర్నర్ చెంచులతో ముఖాముఖి నిర్వహించారు. కర్నూలు విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గం ద్వారా నిర్వాడ మెట్ట వద్ద ఉన్న గిరిజన గురుకుల బాలికల పాఠశాలకు చేరుకున్నారు. ఇక్కడ ఏర్పాటుచేసిన ప్రత్యేక సభా సమావేశంలో చెంచులతో సమావేశమై వారి జీవన విధానాలు ప్రభుత్వ పథకాలు అందుతున్న తీరు వారి అభివృద్ధి తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

ఇవీ చదవండి :

Last Updated :Jan 20, 2023, 9:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.