ETV Bharat / state

సీపీఎస్ రద్దుపై త్వరగా తేల్చాలి: బొప్పరాజు వెంకటేశ్వర్లు

author img

By

Published : Jan 20, 2023, 7:31 PM IST

Etv Bharat
Etv Bharat

Bopparaju Venkateshwarlu: గుంటూరులోని లాంలో జరిగిన ఏపీ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం సదస్సులో పదవి విరమణ ప్రయోజనాల కోసం యూనివర్శిటీ ఉద్యోగులు కోర్టుకు వెళ్లాల్సి రావటం బాధాకరమని ఏపీ జేఏసీ-అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.

Bopparaju Venkateshwarlu: పదవి విరమణ ప్రయోజనాల కోసం యూనివర్శిటి ఉద్యోగులు కోర్టుకు వెళ్లాల్సి రావటం బాధాకరమని ఏపీ జేఏసీ-అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. గుంటూరులోని లాంలో జరిగిన ఏపీ విశ్వవిద్యాలయాల బోధనేతర ఉద్యోగుల సంఘం సదస్సులో ఆయన పాల్గొన్నారు. యూనివర్శిటి ఉద్యోగుల పెన్షన్లు, జీతభత్యాలు, పదవి విరమణ ప్రయోజనాలకు డబ్బులు లేకపోవటం బాధాకరమని వ్యాఖ్యానించారు.

యూనివర్శిటి ఉద్యోగులకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులెవరూ ప్రభుత్వం తీర్చలేని కోరికలు అడగటం లేదన్నారు. అప్పట్లో చర్చల్లో అంగీకరించినవి మాత్రమే ఇవ్వాలని కోరుతున్నామని స్పష్టం చేశారు. ఉద్యోగులపై కొందరు తప్పుడు ప్రచారం ఆపాలన్నారు. కొన్ని ఉద్యోగ సంఘాల వారు గవర్నర్ వద్దకు వెళ్లారని... దానివల్ల నష్టం జరుగుతుందేమోనని భయంగా ఉందని ఆందోళనను వెలిబుచ్చారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సలహాదారు చంద్రశేఖరరెడ్డి ముందు బొప్పరాజు డిమాండ్లు తెలియజేశారు. మంత్రివర్గ ఉపసంఘం వద్ద పూర్తి అధికారాలు లేవు కాబట్టి... నేరుగా ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించేలా చంద్రశేఖరరెడ్డి చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడే మరో ఛలో విజయవాడ జరగకుండా ఉంటుందన్నారు. ఉద్యోగం నుంచి పదవి విరమణ తర్వాత పెన్షన్ రావాలని కోరుకోవటం సహజమని సీపీఎస్ రద్దు విషయంపై త్వరగా తేల్చాలని డిమాండ్ చేశారు.

సీపీఎస్ రద్దు విషయంపై త్వరగా తేల్చాలని డిమాండ్: బొప్పరాజు వెంకటేశ్వర్లు

4, 5 సంవత్సరాలు జీతాలు, పెన్షన్లు ఆగిపోతే ఆ కుటుంబంలో ఎంత బాధ, వ్యధ ఉంటుందో ఓ సారి ఆలోచించండి. బకాయిలు రాకపోతే కోర్టుల చుట్టూ తిరిగి లక్షల రూపాయలు కోర్టులకు పోయాలి. ఆ పరిస్థితులు కలగజేయకూడదని బాధ పడుతున్నాం. -బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరాతి ఛైర్మన్

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.