ETV Bharat / state

Police Overaction in Chandrababu Naidu Arrest: చంద్రబాబు బస వద్ద పోలీసుల ఓవరాక్షన్.. బస్సుతో సహా తీసుకుపోతామంటూ అతి..

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 9, 2023, 1:09 PM IST

Police Overaction in Chandrababu Naidu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు సమయంలో అర్ధరాత్రి నుంచి నంద్యాలలో తీవ్ర హైడ్రామా జరిగింది. టీడీపీ నేతలు, కార్యకర్తల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. చంద్రబాబు బస్సుతో సహా తీసుకుపోతామంటూ అతి చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Police Overaction in Chandrababu Naidu Arrest
Police Overaction in Chandrababu Naidu Arrest

Police Overaction in Chandrababu Naidu Arrest: అత్యంత నాటకీయ పరిణామాల మధ్య చంద్రబాబును అరెస్టు చేసిన సీఐడీ పోలీసులు.. అర్ధరాత్రి నుంచి నంద్యాలలో హైడ్రామా నడిపించారు. బాబు బస చేసిన ఫంక్షన్ హాల్‌కు భారీగా తరలివచ్చిన పోలీసులు.. తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల పట్ల దురుసుగా వ్యవహరించారు. అరెస్టుకు అడ్డంకులు సృష్టిస్తే చంద్రబాబు బస చేస్తున్న బస్సుతో సహా లాక్కెళతామంటూ అతిగా ప్రవర్తించారు. పెద్దసంఖ్యలో నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కి పోలీసులు వ్యవహరించిన తీరు పట్ల తెలుగుదేశం నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.

TDP Chief Chandrababu Naidu Arrested: చంద్రబాబు అరెస్టుకు ముందు అర్ధరాత్రి నుంచే నంద్యాలలో పోలీసులు హైడ్రామా సృష్టించారు. చంద్రబాబు బస చేసిన ఆర్కే ఫంక్షన్ హాల్​ ప్రాంతానికి శుక్రవారం అర్ధరాత్రి చేరుకున్న పోలీసులు.. చాలాసేపు అక్కడే కాపు కాశారు. రెండున్న దాటాక ఫంక్షన్ హాల్ లోపలికి వెళ్లి యుద్ధ వాతావరణం సృష్టించారు. అడ్డుగా ఉన్న తెలుగుదేశం నాయకులు, కార్యకర్తల్ని నెట్టుకుంటూ.. నేరుగా చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు వద్దకు వెళ్లారు. డీఐజీ రఘురామరెడ్డి నేతృత్వంలో చంద్రబాబు నిద్రిస్తున్న బస్సు తలుపు తట్టడంపై.. N.S.G సిబ్బంది తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.

Chandrababu Arrest in Nandyala: నంద్యాలలో చంద్రబాబు అరెస్ట్​.. రోడ్డుమార్గంలో చంద్రబాబు తరలింపు

ఎందుకు వచ్చారో తమకు సమాచారం ఇవ్వాలని స్పష్టంచేశారు. తమ భద్రతా వలయంలో ఉన్న వైఐపీ వద్దకు అర్ధరాత్రి వచ్చి యుద్ధ వాతావరణం సృష్టించే చర్యలను అంగీకరించేది లేదన్నారు. ఇలాంటి చర్యలు ప్రోటోకాల్‌కు విరుద్ధమని N.S.G తేల్చిచెప్పటంతో పోలీసులు వెనక్కి తగ్గారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు.. అంతలోనే మాట మార్చారు. చంద్రబాబుకు భద్రత కల్పించేందుకు వచ్చామంటూ సర్దుకునే ప్రయత్నం చేశారు.

చంద్రబాబును అరెస్టు చేస్తారన్న సమాచారం రావడంతో.. ఆయన బస చేసిన ఆర్కే ఫంక్షన్‌ హాలు వద్దకు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. అక్కడికి తరలివచ్చిన తెలుగుదేశం నాయకులు అఖిలప్రియ, భూమా బ్రహ్మానందరెడ్డి, జగత్‌విఖ్యాత్‌రెడ్డి, ఎ.వి.సుబ్బారెడ్డి, బీసీ జనార్దన్‌రెడ్డి సహా మరికొందరు నాయకులను అదుపులోకి తీసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. పెద్దసంఖ్యలో కార్యకర్తలను కూడా అదుపులోకి తీసుకున్నారు. అలాగే ఫంక్షన్ హాల్ వద్ద ఉన్న తెలుగుదేశం నాయకుల వాహనాలను పక్కకు తప్పించారు. మీడియా ప్రతినిధులను అక్కడి నుంచి పంపించి వేశారు. రోప్ పార్టీ ఏర్పాటు చేసి రూట్‌ క్లియరెన్స్‌ చేశారు.

Political Leaders Comments On Chandrababu Arrest: చంద్రబాబు అరెస్ట్..ఖండించిన పలువురు నాయకులు

Babu Surety Future Guarantee Program: ‘బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రాత్రి నంద్యాలలో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఆ తర్వాత ఆర్కే ఫంక్షన్ హాల్‌లో బస చేశారు. అదే సమయంలో అనంతపురం నుంచి ఆరు బస్సుల్లో పోలీసులు నంద్యాలకు వచ్చారు. పట్టణంలో అడుగడుగునా చెక్‌పోస్టులు, బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు.. భారీ ఎత్తున సోదాలు చేశారు. ఈ చర్యలతో నంద్యాలలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.

Ganta Srinivasa Rao Arrested: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.