ETV Bharat / state

పాణ్యం బడిలో గుంత.... ఆడుకోవాలంటే చింత....

author img

By

Published : Nov 5, 2019, 7:38 PM IST

పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా గుంతలు

కర్నూలు జిల్లా పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. పాఠశాల ఆవరణలో స్టేడియం నిర్మాణానికి తీసిన గుంతలు ఏడాది కాలంగా అలాగే ఉన్నాయి. విద్యార్థులు భయం భయంగా ఆటలు ఆడుకోవాల్సి వస్తుందని...ఆడుకుంటున్న సమయంలో గుంతలో పడితే గాయాలపాలవుతారని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు.

పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా గుంతలు

కర్నూలు జిల్లాలోని పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గుంతలు విద్యార్థులను ప్రమాదాల్లోకి నెడుతున్నాయి. పాఠశాల మైదానంలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం 2018లో రూ. 2కోట్ల నిధులు మంజూరయ్యాయి. పాఠశాల మైదానంలో కొలతలు వేసి గుంతలు తవ్వించారు. అనంతరం నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో క్రీడామైదానంలో గుంతలు అలాగే దర్శనమిస్తున్నాయి. మైదానంలో ఆడుకోవటానికి వెళ్లిన విద్యార్థులు గుంతల వల్ల భయంభయంగా ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆడుకుంటున్న సమయంలో గుంతల్లో ఆట వస్తువులు పడుతుండడంతో... ఆటవస్తువులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు విద్యార్థలు గాయాలపాలవుతున్నారు. వర్షం పడినప్పుడు గుంతలు నీటితో నిండి పిచ్చిమొక్కలు మొలుస్తున్నాయి. ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం చేసుకుంటుందోనని... ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు భయపడుతున్నారు. అధికారులు స్పందించి గుంతలు పూడ్చివేసి...విద్యార్థులు ఆటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని వారు కోరుతున్నారు.

ఇదీ చదవండి: 'బట్టలు ఉతకనన్నారని... 13 రజక కుటుంబాలను వెలివేశారు'

Intro:Ap_knl_141_04_guntali_school_ab_Ap10059 కర్నూలు జిల్లా పాణ్యం లోని ఉన్నత పాఠశాలలో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం తీసిన గుంతలు ప్రమాదకరంగా మారాయి


Body:కర్నూలు జిల్లా పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో గుంతలు విద్యార్థులను ప్రమాదాల్లో కి నె డుతున్నాయి పాణ్యం లో ఇండోర్ స్టేడియం నిర్మాణం కోసం 2018లో రెండు కోట్ల నిధులు మంజూరయ్యాయి స్టేడియం నిర్మాణం కోసం పాణ్యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో స్థలాన్ని గుర్తించారు గుత్తేదారులు నిర్లక్ష్యం చేయడంలో పనులు ప్రారంభించడానికి కొంత ఆలస్యం జరిగింది అన్ని సమస్యలు పూర్తి చేసుకొని స్టేడియం నిర్మాణం కోసం పనులు ప్రారంభించారు ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో కొలతలు వేసి మార్కింగ్ ఇచ్చుకొని గుంతలు తవ్వించారు అనంతరం నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో క్రీడామైదానంలో గుంతలు అలాగే దర్శనమిస్తున్నాయి గుంతలు విద్యార్థులు ఆడుకోవడానికి ఆటంకంగా మారాయి మైదానం ఉన్న విద్యార్థులు భయంభయంగా ఆడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఆడుకుంటున్న సమయంలో గుంతల్లో జారిపడడం గుంతల్లో ఆట వస్తువులు పడుతుండడంతో ఆటవస్తువులు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు గుంతలో పడి గాయాలపాలు అవుతున్నారు వర్షం పడినప్పుడు గుంతలు నీటితో నిండడం తో ఎప్పుడూ ఎలాంటి ప్రమాదం చేసుకుంటుందని ఉపాధ్యాయులు తల్లిదండ్రులు భయపడుతున్నారు చుట్టూ పిచ్చిమొక్కలు పెరగడంతో గుంతలు కనపడకపోవడం తో విద్యార్థులకు మరింత ప్రమాద కరంగా మారాయి నూతన ప్రభుత్వం ఏర్పడడంతో స్టేడియం నిర్మాణం పై అధికారులు ఎటు తేల్చుకోలేక పోతున్నారు 25 శాతం నిర్మాణ పనులు పూర్తి అయితేనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో నిర్మాణం ముందుకు కదిలే పరిస్థితి లేదని తెలుస్తుంది అధికారులు స్పందించి గుంతలను పూర్తి వేసి మైదానాన్ని చదును చేయాలని విద్యార్థులు ఆటలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని విద్యార్థులు విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు


Conclusion:నవీన్ కుమార్ పాణ్యం ఈ టీవీ రిపోర్టర్ కర్నూలు జిల్లా

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.