ETV Bharat / state

'బట్టలు ఉతకనన్నారని... 13 రజక కుటుంబాలను వెలివేశారు'

author img

By

Published : Nov 4, 2019, 11:57 PM IST

'ఏ కులంలో పుడితే ఆ వృత్తే చేయాలి... అలాగే కడవరకు ఉండిపోవాలి. తక్కువ కులంలో పుట్టి రైతులా వ్యవసాయం చేస్తా అంటే మేము ఊరుకోం... ఊరినుంచి బహష్కరిస్తాం' అంటున్నారు కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని వేముగోడు గ్రామస్థులు. అసలేం జరిగింది... ఆ కుటుంబాలను ఎందుకు బహిష్కరిస్తున్నారు'

రజకులను వెలివేసిన గ్రామస్థులు

రజకులను వెలివేసిన గ్రామస్థులు

కర్నూలు జిల్లా వేముగోడులో మొత్తం 400 కుటుంబాలు ఉన్నాయి. అక్కడ దాదాపు అన్ని వర్గాల వారు జీవిస్తున్నారు. అందులో 13 రజక కుటుంబాలున్నాయి. దాదాపు 50 వరకు వారి జనాభా ఉంటుంది. ఆరేళ్ల క్రితం వరకు గ్రామస్థుల బట్టలను రజక కుటుంబాలే ఉతికేవి. కానీ, ఈ ప్రాంతాన్ని కరవు ముంచెత్తడంతో, బట్టలు ఉతకడానికి నీళ్లు లేకుండాపోయాయి. వారు బట్టలు ఉతకడం మానేశారు. వారంతా తమ భూముల్లో వ్యవసాయం చేయటం మొదలుపెట్టారు. అయితే ఈ మధ్య పడిన వర్షాలతో గ్రామస్థులంతా రజకులను తిరిగి తమ బట్టలు ఉతకాలని ఒత్తిడి చేస్తున్నారు.


గ్రామస్థుల నిర్ణయానికి రజక కుటుంబాలు ససేమిరా అన్నాయి. ఆగ్రహించిన ఊరిజనం... ఇకపై రజకులను కూలి పనులకు పిలవొద్దని..వారికి ఎలాంటి సాయం చేయొద్దని.. వారితో మనకు అవసరం లేదని పంచాయతీలో తీర్మానం చేశారు. గ్రామస్థుల నిర్ణయానికి రజకులు మనస్థాపం చెంది పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను పిలిచి చర్చించటంతో సమస్యకు తెరపడింది. బలవంతంగా కులవృత్తి చేసే ప్రసక్తే లేదని రజకలు చెబుతున్నారు.ఇరువర్గాలతో మాట్లాడి సమస్యను పరిష్కరించామని ఎస్సై హనుమంత రెడ్డి చెపుతున్నారు. ప్రస్తుతం పోలీసులు అప్పుడప్పుడూ వేముగోడు గ్రామానికి వెళ్లి వస్తున్నారు. కానీ, తమను కులవృత్తిలోకి లాగే శక్తి నుంచి ఎంతకాలం తప్పించుకోగలం? అన్న అనుమానం మాత్రం రజకుల కళ్లల్లో ఇంకా కనిపిస్తూనే ఉంది.

ఇదీ చూడండి

ప్రజలను నమ్మించి మోసం చేసినట్లు తేలిపోయింది'

Intro:ap_knl_32_24_rajakulu_samajika bahiskarana_abbb_ap10130 కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలంలోని వేముగోడు లో రజకులు కులవృత్తి చేయాలని గ్రామస్థులు ఒత్తిడి చేయడం కలకలం రేపింది. పోలీసులు జోక్యం తో సమస్యకు తెరపడింది. గ్రామంలోని రజకులు కులవృత్తి వదిలి వ్యవసాయ పనులు చేసుకొని జీవిస్తున్నారు. వారం రోజుల నుంచి గతంలో వలే కులవృత్తి చేయాలని వారిపై ఒత్తిడి పెంచారు. గ్రామంలో వ్యవసాయ పనులకు పిలువరాదని ఆంక్షలు విధించడముతో తమను సామాజికంగా బహిష్కరణ చేస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు వర్గాలను పోలీసులు పిలిపించి మాట్లాడటం తో ఇరువురు గత ఆరేళ్లుగా ఉన్నట్లే ఉంటామనడముతో సమస్యకు తెరపడింది. గ్రామంలో పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు. బైట్స్:చంద్రశేఖర రావు, రజక సంఘము రాష్ట్ర నాయకుడు, 2,గ్రామస్థుడు,3,హనుమంత రెడ్డి, ఎసై, గోనెగండ్ల, సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు, కర్నూలు జిల్లా,8008573794.


Body:రజకులు


Conclusion:సామాజిక బహిష్కరణ

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.